Watermelon Risks: గుండె సంబంధిత రోగాలున్నవారు, దగ్గు , జబులు, డయాబెటీస్ పేషెంట్లు, ఆర్థరైటిస్ రోగులు పుచ్చకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో పుచ్చకాయ మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఈ పండును తరచుగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటుంటారు.
26
పుచ్చకాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వేసవిలో ఈ పండును తప్పకుండా తినాలని ఆరోగ్యా నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు మాత్రం పుచ్చకాయను తినకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఏయే సమస్యలున్నవారు ఈ పండును తినకూడదో తెలుసుకుందాం..
36
హార్ట్ పేషెంట్స్.. గుండె సంబంధిత రోగాలతో బాధపడేవారు పుచ్చకాయను తినకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎందుకంటే ఈ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఈ పొటాషియం శరీరంలో పెరిగితే పల్స్ రేట్ పడిపోవడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
46
దగ్గు, జలుబు.. దగ్గు, జలుబు సమస్యతో బాధపడుతున్నవారు పుచ్చకాయకు వీలైతనంత దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండు చలువను చేస్తుంది. దీంతో దగ్గు, జలుబు సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
56
డయాబెటీస్ పేషెంట్లు.. పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లు పుచ్చకాయను తింటే వారి శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మధుమేహులు పుచ్చకాయను దూరంగా పెట్టాలి.
66
ఆర్థరైటిస్ రోగులు.. ఆర్థరైటిస్ జబ్బుతో బాధపడుతున్నవారు పుచ్చకాయను తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీళ్లు ఈ పండును తింటే కీళ్ల నొప్పులు, వాపు ఎక్కువ అవుతుంది.