ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను ఆహారంలో చేర్చుతున్నారా? ఎందుకు తీసుకోవాలో తెలుసా?

First Published Sep 17, 2021, 2:06 PM IST

ఆరోగ్యకరమైన కొవ్వుల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఒకటి. నిజానికి ఈ రకమైన కొవ్వులు చాలామంది ఆహారంలో కొరత ఉంటుంది. ఇది చాలా పోషకవిలువలతో కూడినది. ఇది ముఖ్యంగా, చేపలు, కొన్ని సీఫుడ్‌లలో ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ప్రాసెస్ చేయబడిన నూనెలు, ఇతర సహజ ఆహారాలలో లభిస్తాయి. అయితే చేపలు, సీఫుడ్స్ లోనే ఎక్కువగా లభిస్తుంది. అందుకే ఆహారంలో చేపల నూనెను తరచుగా చేర్చాలని సిఫార్సు చేస్తున్నారు. 

కొవ్వులు అనగానే చెడు మాత్రమే అని భావిస్తాం. అయితే దీంట్లో మంచి కొవ్వులు కూడా ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే మన ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం చాలా అవసరం. వీటివల్ల అనేక  ప్రయోజనాలు ఉన్నాయి.

ఆరోగ్యకరమైన కొవ్వుల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఒకటి. నిజానికి ఈ రకమైన కొవ్వులు చాలామంది ఆహారంలో కొరత ఉంటుంది. ఇది చాలా పోషకవిలువలతో కూడినది. ఇది ముఖ్యంగా, చేపలు, కొన్ని సీఫుడ్‌లలో ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ప్రాసెస్ చేయబడిన నూనెలు, ఇతర సహజ ఆహారాలలో లభిస్తాయి. అయితే చేపలు, సీఫుడ్స్ లోనే ఎక్కువగా లభిస్తుంది. అందుకే ఆహారంలో చేపల నూనెను తరచుగా చేర్చాలని సిఫార్సు చేస్తున్నారు. 

అయితే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు నిజంగా ఆరోగ్యకరమైనది, ప్రయోజనకరమైనదేనా? ప్రతి ఒక్కరూ చేప నూనె సప్లిమెంట్లను వాడాల్సిందేనా? చేప నూనె అంటే ఏమిటి? చూద్దాం..

అసంతృప్త కొవ్వు రూపంలో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సీఫుడ్స్ నుంచి తయారైనవి మంచి నాణ్యతతో ఉంటాయి. చేపల నూనె, చేప నూనె సప్లిమెంట్‌లు సాల్మన్, చేపలు, సార్డినెస్, ట్రౌట్‌తో సహా కొన్ని రకాల సీఫుడ్‌లలో కనిపించే కొవ్వు కణజాలాల నుండి తీసుకోబడతాయి. కాడ్ లివర్ ఆయిల్, క్రిల్ ఆయిల్‌లో కూడా ఒమేగా -3 ఉంటుంది. వీటితో విటమిన్ ఎ, డి, ఇతర శోథ నిరోధక లక్షణాలు కూడా ఆరోగ్యకరమైన మోతాదులో ఉన్నందున చేప నూనె అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. చేపలలో రెండు రకాల ఒమేగా -3 లో EPA, DHAలు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి, పనితీరుకు సహాయపడతాయి.

ఆహారంలో చేప నూనెను చేర్చడం వల్ల  ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? అంటే.. 
1. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది : ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను క్రమం తప్పకుండా తీసుకోవడం, ఇతర రకాల కొవ్వుల మాదిరిగా కాకుండా, రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అధ్యయనాల ప్రకారం, వారానికి రెండుసార్లు చేపలు తినేవారు లేదా చేప నూనె సప్లిమెంట్లను ఏ రూపంలో అయినా తీసుకునేవారికి గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ స్థాయిల్లో పెరుగుదల లాంటి ప్రమాదాలు తగ్గుతాయి. 

2. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది : ఒమేగా -3లు మెదడు ఆరోగ్యానికి అమృతంలా పరిగణించబడతాయి. ఎందుకంటే చేప నూనెలో ఉండే శోథ నిరోధక లక్షణాలు సెల్యులార్ స్థాయిలో మెదడు పనితీరును ప్రోత్సహించడంలో సహాయపడతాయి. వయసు మీద పడుతున్నప్పటికీ మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది. 

అల్జీమర్స్ లేదా చిత్తవైకల్యంలాంటి ప్రమాదాల్ని తగ్గించడం లేదా నిరోధించడంలో ఒమేగా -3 చేపల నూనె ప్రభావం గురించి శాస్త్రవేత్తలు ఇంకా విశ్లేషణలు కొనసాగిస్తున్నారు. అయితే కొన్ని అధ్యయనాలు ఒమేగా -3 సప్లిమెంట్లను తీసుకునే వారికి కాగ్నిటివ్ డిక్లైన్ ప్రమాదం తక్కువగా ఉందని సూచిస్తున్నాయి. అంతేకాకుండా, ఈ ఆయిల్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల మూడ్ స్థాయిలను పెంచడానికి, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

కీళ్లలో మంటను తగ్గిస్తుంది : ఒమేగా -3 వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ వలె, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకోవడం వలన కీళ్ళు, కండరాలలో వాపులను తగ్గించడానికి  సహాయపడుతుందని చెబుతున్నారు, ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి బాధాకరమైన, దీర్ఘకాలిక పరిస్థితితో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా సహాయపడుతుంది. ఒమేగా -3 లు సైటోకిన్స్, ఇతర ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాల ఉత్పత్తిని పరిమితం చేయడంలో కూడా ప్రతిభావంతంగా పనిచేస్తాయి. 

సడెన్ కార్డియాక్ అరెస్ట్ : నేటి రోజుల్లో కార్డియాక్ అరెస్ట్‌లు, హార్ట్ ఫెయిల్యూర్‌లు సాధారణ సమస్యగా మారిపోయాయి. అయితే కొన్ని అధ్యయనాల్లో ఒమేగా -3 లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అరిథ్మియా (అసాధారణ హార్ట్ రిథమ్) అవకాశాలను తగ్గించవచ్చని తేలింది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్ట్రోకులు, ఆకస్మిక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. 

బరువు తగ్గడంలో.. బరువు తగ్గడం అనేది అంత సులభమైన విషయం కానప్పటికీ, చేపల నూనె, ఇతర ఒమేగా -3 రిచ్ సోర్సెస్ వల్ల వ్యాయామాలను మెరుగుపరచడం,జీవక్రియ సంశ్లేషణను పెంచడం. కండరాల పునరుద్ధరణకు సహాయపడటం ద్వారా బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. 

ఫిష్ ఆయిల్స్ అందరికీ అవసరమా? అంటే కాదనే చెప్పాలి. కోర్ డెఫిషియన్స్, లేదా వైద్యుల సిఫార్సు చేస్తేనే తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనం కోసం, చేపల నూనె సప్లిమెంట్‌లకు మారడానికి ముందు, ఆహారంలో కొవ్వు చేపలు, సీఫుడ్‌ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఆహారంలో చేపలు, ఇతర సీఫుడ్ ఆరోగ్యకరమైన తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. శాఖాహారులకు తక్కువ అవకాశాలు ఉన్నందున ఒమేగా -3 అధికంగా ఉండే కూరగాయలు, గింజలు, విత్తనాలు తీసుకోవడం మీద దృష్టి పెట్టాలి.  

ఫిష్ ఆయిల్ సప్లిమెంట్‌ల రుచిని అలవాటు చేసుకోవడం మొదట కొంచెం అసౌకర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఒకేసారి అధిక మొత్తంలో కొవ్వును తీసుకుంటే వికారం, బర్ప్స్‌కు కారణమవుతుంది. కొందరిలో ఈ మాత్రలు వేసుకుంటే.. చేపలు తిన్న తరువాత ఉండేలాంటి ఫీలింగ్ ఉంటుంది. అందుకే వీటిని మీ భోజనంతో చేర్చడంలేదా మాత్రలను ఫ్రీజర్‌లో ఉంచడం ద్వారా సప్లిమెంట్ తీసుకోవడం చాలా మంచిది. అలాగని ఇష్టం వచ్చినట్లు వాడకూడదు. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం వాడాలి. కొంతమందిలో, కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్  ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సప్లిమెంట్లను భోజనంతో తీసుకోవడం మంచిది, ఖాళీ కడుపుతో కాదు. ఆహారంతో పాటు మాత్ర తీసుకోవడం వల్ల కొవ్వు శోషణను పెంచుతుంది. వికారం, గుండెల్లో మంట ఇతర జీర్ణ దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

click me!