కాలుష్యం, దుమ్ము మన చర్మ ఆరోగ్యాన్ని ఎంతో దెబ్బతీస్తాయి. వీటితో పాటుగా ఒత్తిడి, హార్మోన్లు, జంక్ ఫుడ్ మొదలైనవి కూడా మన చర్మంపై ప్రభావం చూపుతాయి. వీటన్నింటి వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. మొటిమల వల్ల చర్మంలో ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ మూసుకుపోయిన రంధ్రాలలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అలాగే దీనివల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. అయితే చాలా మొటిమలు మొఖంపై మచ్చలను కలిగిస్తాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. అందుకే మొటిమలకు చికిత్స చేయడం చాలా ముఖ్యం. మొటిమలను తగ్గించుకోవడానికి మీరు మందులనే వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే కొన్ని నేచురల్ వస్తువుల సహాయంతో కూడా మొటిమలను నయం చేయవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..