మండల పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక ముఖ్యమైన ఆచారం కూడా. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పూజ మండల కలాం అని పిలువబడే 41 రోజుల సుదీర్ఘ తపస్సు ముగింపును సూచిస్తుంది. ఈ పండుగను అయ్యప్ప భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 27 న మండలపూజ ఉత్సవాలు జరగనున్నాయి.
మండల పూజ ప్రాముఖ్యత
శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే అత్యంత ప్రసిద్ధ ఘట్టాలలో మండల పూజ, మకర విళక్కు లు ఉన్నాయి. ఈ సమయంలో ప్రజలు దూరప్రాంతాల నుంచి వచ్చి మరీ అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. ఇక ఈ మండల పూజ నాడు ఆలయం భక్తుల కోసం రోజంతా తెరిచే ఉంటుంది. మండల పూజ మాత్రమే ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చగలదని నమ్ముతారు. ఈ పూజను లింగం, వయస్సు వంటి భేదాలు లేకుండా ఎవరైనా చేయొచ్చు. మండల పూజను భక్తి శ్రద్ధలతో చేస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయనే నమ్మకం ఉంది.
మండల పూజా విధి
అయ్యప్పమాల వేసిన వారు మండల పూజ ఉపవాసం ఉండాలి.
మండల పూజ సమయంలో అయ్యప్పస్వాములు విత్రమైన, సరళమైన జీవితాన్నే గడపాలి.
అయ్యప్పస్వాములు ఉపవాసం సమయంలో తమ శరీరంతో పాటుగా మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే ఎలాంటి చెడు ఆలోచనలు రానీయకూడదు
41 రోజుల పాటు అయ్యప్పస్వాములు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలి.
అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ కు దూరంగా ఉండాలి.
రోజుకు రెండుసార్లు పూజ చేయాలి.
అలాగే రోజుకు రెండు సార్లు స్నానం చేయాలి.
ఈ సమయంలో నల్ల ధోతీ ధరించి అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పిస్తారు.
అయ్యప్పమాల వేసిన వారు మంచంపై పడుకోరు. అలాగే ఆలయానికి చెప్పులు లేకుండా వెళతారు.
ఈ ఉపవాస సమయంలో దానధర్మాలకు కూడా ప్రాధాన్యమిస్తారు.