Cholesterol: అధిక కొలెస్ట్రాల్ లో బాధపడుతున్నారా? ఈ జ్యూస్ లను తాగితే కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది తెలుసా

Published : Jun 23, 2022, 10:42 AM IST

Cholesterol: గుండె జబ్బులు (Heart disease), అధిక రక్తపోటు, స్ట్రోక్ (Stroke) వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు మూల కారణం అధిక కొలెస్ట్రాలే. అందుకే కొలెస్ట్రాల్ ను వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. 

PREV
16
Cholesterol: అధిక కొలెస్ట్రాల్ లో బాధపడుతున్నారా? ఈ జ్యూస్ లను తాగితే కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది తెలుసా
cholesterol

అధిక కొలెస్ట్రాల్ (High cholesterol) వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు (Heart disease), అధిక రక్తపోటు (High blood pressure), స్ట్రోక్ (Stroke)వంటి వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 

26
cholesterol

అధిక కొలెస్ట్రాల్ లైంగిక అంగస్తంభన (Sexual erection)లోపంతో సహా అనేక సమస్యలకు కారణం కావచ్చని అధ్యయనాలు సూచించాయి. అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి ఆహారం (Food), జీవనశైలి (Lifestyle)లో అనేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆహారంలో మరికొన్ని పానీయాలను భాగం చేసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

36

చెర్రీ జ్యూస్ (Cherry juice):

కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చెర్రీ జ్యూస్ (Cherry juice)ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చెర్రీ జ్యూస్ ను రోజూ తీసుకోవడం వల్ల ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్, రక్తపోటు గణనీయంగా తగ్గుతుంది. ఇది మంచి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

46

దానిమ్మ రసం (Pomegranate juice):

దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant)గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిలో గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే మూడు రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన రసం. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దానిమ్మ రసం ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడటమే కాకుండా రక్తనాళాలకు జరిగే నష్టాన్ని తగ్గించి, ధమని దృఢత్వాన్ని నివారిస్తుంది. అధ్యయనం ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో దానిమ్మ రసం తీసుకోవడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించవచ్చు.

56

టొమాటో జ్యూస్ (Tomato juice):

టొమాటో జ్యూస్ (Tomato juice)లో లైకోపీన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. యాంటీఆక్సిడెంట్ల ఆహారం ఎల్ డిఎల్,  మొత్తం కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడటం ద్వారా గుండె జబ్బులు, క్యాన్సర్, వృద్ధాప్యం, అల్జీమర్స్ వ్యాధి, స్ట్రోక్, ఇతర వ్యాధులను తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు.

66

సోయా మిల్క్ (Soy Milk):

సంతృప్త కొవ్వు (Saturated fat) తక్కువగా ఉండే సోయా పాలు కూడా కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అధిక కొవ్వు పాల ఉత్పత్తులకు బదులుగా సోయా పాలను ఎంచుకోవడం ఆరోగ్యకరం. సోయా ప్రోటీన్ గుండె రోగులకు మంచిదని కూడా శాస్త్రీయంగా నిరూపించబడింది.
 

Read more Photos on
click me!

Recommended Stories