పిల్లలు ఉన్న ఇంట్లో ఎలుక ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఆడుకునే వస్తువులను ఎలుక నోటితో తాకినా లేదా కొరికినా పిల్లలు వాటిని నోట్లో పెట్టుకొనే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల పిల్లలకు అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే ఇంట్లో నుంచి ఎలుకలను సులభంగా ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోకి ఎలుకలు రావడానికి కారణం
ఇంట్లో ఆహార పదార్థాల తినేందుకు ఎలుకలు వస్తాయి. వర్షాకాలంలో ఇంటి బయట మురుగు నీరు నిలిచి ఉంటే, మురుగు కాలువల ద్వారా ఎలుకలు సులభంగా ఇంట్లోకి వచ్చేస్తాయి. చలికాలంలో ఎలుకలకు వెచ్చదనం అవసరం కాబట్టి, అవి ఇంట్లోకి వస్తాయి. ఎలుకలకు చెత్త, చీకటి ప్రదేశం అంటే ఇష్టం. అలా ఉన్న ఇళ్లలో ఎలుకలు ఎక్కువగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: స్నానం చేసేటప్పుడు సబ్బుతో మొదట మొహం రుద్దుకోవాలా? ఒళ్లు రుద్దుకోవాలా?
పుదీనా నూనె
ఎలుకలకు పుదీనా నూనె నుండి వచ్చే వాసన నచ్చదు. కాబట్టి మీ ఇంటి మూలల్లో పుదీనా నూనెను చల్లాలి. ఇలా చేస్తూ ఉంటే ఎలుక ఇంట్లో నుంచి పారిపోతుంది.
ఉల్లిపాయ
ఉల్లిపాయ నుండి ఒక విధమైన ఘాటైన వాసన వస్తుంది. ఎలుకలకు అది నచ్చదు. కాబట్టి ఎలుకలు ఉండే చోట లేదా వచ్చే చోట ఉల్లిపాయను కట్ చేసి పెట్టాలి. దీని వల్ల ఎలుక ఇంట్లో ఉన్నా పారిపోతుంది. ఉల్లిపాయ త్వరగా కుళ్లిపోతే మళ్లీ కొత్త ఉల్లిపాయను మార్చాలి.
మిరియాల పొడి
మిరియాల పొడి ప్రతి ఒక్కరి ఇంటి వంటగదిలో తప్పకుండా ఉంటుంది. ఇది ఎలుకలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. దీన్ని మీ ఇంటి మూలల్లో చల్లివేయండి. దాని నుండి వచ్చే ఘాటైన వాసన ఎలుకలను తరిమికొడుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిని ఒలిచి దంచి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో దంచిన వెల్లుల్లిని వేసి ఆ గిన్నెను ఎలుకలు ఉండే చోట లేదా వచ్చే చోట పెట్టండి. వెల్లుల్లి నుండి వచ్చే వాసనకు ఎలుకలు పారిపోతాయి.
లవంగ నూనె
ఎలుకలకు లవంగ నూనె నుండి వచ్చే వాసన నచ్చదు. కాబట్టి ఎలుక కన్నంలో ఒక చుక్క లవంగ నూనె వేయండి. దీని వల్ల ఎలుకలు అక్కడి నుంచి పారిపోతాయి.
బిర్యానీ ఆకు
బిర్యానీ ఆకు నుండి వచ్చే ఘాటైన వాసన ఎలుకలకు నచ్చదు. కాబట్టి దాన్ని ఎలుకలు ఉండే చోట పెడితే దాన్ని తిన్న కొద్దిసేపటికే ఎలుకలు చనిపోతాయి. అలాగే ఎలుకలు వచ్చే చోట కూడా 2-3 బిర్యానీ ఆకులను వేయండి.