నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022: మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే ఈ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే..!

Published : Sep 01, 2022, 12:54 PM IST

నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022: ఈ ఉరుకుల పరుగుల లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మర్చిపోయారు. సమయం లేదని కొందరు.. తక్కువ సమయం ఉందని ఇంకొందరు ఇలా ఆరోగ్యాన్ని గాలికి వదిలిస్తే భవిష్యత్తులో లేని పోని రోగాల బారిన పడాల్సి వస్తది.   

PREV
16
నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022:  మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే ఈ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే..!
National Nutrition Week

ఈ రోజుల్లో ఆరోగ్యం గురించి పట్టించుకునేటోళ్లను వేళ్లపై లెక్కించుకోవచ్చు. కానీ ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తే ప్రాణాలను తీసే రోగాల బారిన పడాల్సి వస్తది. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ టైం లేదని ఫాస్ట్ ఫుడ్ ను, జంక్ ఫుడ్ ను తినేవారున్నారు. వీటికి తోడు తెల్లవార్లూ సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడం, తక్కువగా నిద్రపోవడం వంటి చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యాన్ని చేతులారా దెబ్బతీసుకుంటున్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.. 
 

26

ఆరోగ్యకరమైన ఆహారమే శరీరానికి ఇంధనం

ఉదయం మీరు తినే ఆహారమే రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా, హుషారుగా ఉంచుతుంది. అలాగే రక్తంలోని చక్కెరను తిరిగి నింపుతుంది. బ్రేక్ ఫాస్ట్ యే మీరు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. కానీ కొంతమంది సమయం లేదనో..లేకపోతే బరువు పెరుగుతున్నామనో.. బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. ఇది కాస్త డయాబెటీస్, గుండె జబ్బులు, అధిక రక్తపోటుు, అధిక కొలెస్ట్రాల్ వంటి జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఉదయం ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ను తప్పకుండా చేయండి. 
 

36

పండ్లు, కూరగాయలతో మీ ప్లేట్ ను నింపండి

పండ్లు, కూరగాయల ద్వారా మన శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. అంతేకాదండోయ్ వీటిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ ఫుడ్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపును త్వరగా నిండేలా చేస్తాయి. దీంతో మీ బరువు నియంత్రణలో ఉంటుంది. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా సహాయపడతాయి. అలాగే రక్తపోటును కూడా కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. 
 

46

చేయాల్సినవి, చేయకూడనివి

భోజనంలో ప్రోటీన్ బార్ లు, మఖానాలు, బజ్రా పఫ్ లు ఉండేట్టు చూసుకోండి. ఇవి ఎంతో ఆరోగ్యవంతమైనవి. ఉప్పు, చక్కెర, ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లను తీసుకోవడం తగ్గించండి. కెఫిన్ ను  తీసుకోవడం తగ్గించండి. వీటికి బదులుగా పాలు, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, నిమ్మరసం, నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండండి. ఇవే మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. 
 

 

56

శరీరక శ్రమ

శరీరక శ్రమ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి. దీనివల్ల నిద్రలేమి, వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. ఇది రక్త ప్రవాహం కూడా పెరుగుతుంది. ప్రతిరోజూ ఒక 15 నిమిషాలు నడవడం, అరగంట పాటు యోగా చేయడం లేదా గంటపాటు జిమ్ చేయడం, భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే నిరాశ, ఒత్తిడి వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. అలాగే శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి. దీంతో మీరు మరింత చురుగ్గా మారుతారు. ఎన్నో వ్యాధులు కూడా దూరమవుతాయి. 
 

66

విటమిన్ డి, విటమిన్ బి12

ప్రస్తుత కాలంలో విటమిన్ డి, విటమిన్ బి12 లోపాలు చాలా  మందిని వేధిస్తున్నాయి. వీటి వల్ల ఎముకలు, మెదడు, హార్మోన్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఈ విటమిన్ల లోపం నుంచి బయటపడాలంటే ఉదయం 30 నిమిషాల పాటు సూర్యరశ్మిలో ఉండండి. అలాగే పాలు, పాల ఉత్పత్తులను, పుట్టగొడుగులు వంటి ఆహారాలను తినండి. 
 

click me!

Recommended Stories