నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022: జాతీయ పోషకాహార వారోత్సవాల విషెస్, మెసేజెస్, కోట్స్, ఫోటోస్ మీ కోసం..

Published : Sep 01, 2022, 12:00 PM IST

నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022: ప్రజలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుకుంటారు.   

PREV
18
నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022:  జాతీయ పోషకాహార వారోత్సవాల విషెస్, మెసేజెస్, కోట్స్, ఫోటోస్ మీ కోసం..
national nutrition week 2022

నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022: భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ పోషకాహార వారోత్సవాలను సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరుపుకుంటారు. ఈ పోషకాహార వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల  గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022 మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పోషకాహారం ఏ విధంగా సహాయపడుతుందో తెలియజేస్తుంది. 

28

నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022 కూడా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ను తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. అందులోనూ వీటిని తినడం వల్ల శరీరం ఎన్నో రోగాల బారిన పడుతుందని నొక్కి చెప్తుంది.  అందుకే ఈ పోషకాహార వారోత్సవాల సందర్బంగా మనమందరం పోషకాహారాన్ని తీసుకుంటూ.. ఇతరులను కూడా తీసుకునే విధంగా ప్రోత్సహించాలి. అప్పుడే పోషకాహార లోపం పోతుంది. ఈ సందర్భంగా మీ ఫ్రెండ్స్ కు ఫ్యామిలీ మెంబర్స్ కు బంధువులకు విషెస్, వాట్సాప్ మెసేజెస్ మీకోసం కొన్ని ఇక్కడ ఉన్నాయి. 

38

నేషనల్ న్యూట్రిషన్ వీక్ 2022:  ఎందుకు ముఖ్యమైనది?

భారత ప్రభుత్వపు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్  పోషకాహారం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి జాతీయ పోషకాహార వారోత్సవాలను వార్షికంగా వారం రోజుల పాటు నిర్వహిస్తుంది.
 

48

జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు  శుభాకాంక్షలు!  మీరు ఆరోగ్యంగా బతకాలంటే మంచి ఆహారాన్నే తినండి..హ్యాపీ న్యూట్రిషన్ వీక్!

ఈ జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా మనమందరం ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్నే తింటామని ప్రతిజ్ఞ చేద్దాం.. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్బంగా మీకు, మీ కుటుంబ సభ్యలకు శుభాకాంక్షలు..   
 

58
Image: Jill Willington

ఇప్పటికీ మన దేశంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బాధ్యతాయుతమైన, అవగాహన కలిగిన పౌరుడిగా పోషకాహార లోపాన్ని అంతం చేయడంలో ప్రజలకు సహాయపడటం మన బాధ్యత. హ్యాపీ నేషనల్ న్యూట్రిషన్ వీక్!

చిన్నప్పటి నుంచీ మనం పోషకాహారమే తింటూ వస్తున్నాం.. కానీ పెద్దయ్యాక మాత్రం మంచి ఆహారాలకు బదులుగా ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలనే తింటున్నాం.. ఇది ఎన్నో జబ్బులకు దారితీస్తుంది. అందుకే ఈ చెడు అలవాటును వదులుకోండి.. హ్యాపీ నేషనల్ న్యూట్రిషన్ వీక్..

 

68
National Nutrition Week

మనలో చాలా మంది రోగమొస్తేనే.. పోషకాహారం విలువను తెలుసుకుంటారు..వాటినే తింటుంటారు. ముందునుంచే పోషకాహారం తీసుకుంటే ఆ రోగాలనేవే రావుకదా.. ఇప్పటి నుంచైనా ఈ అలవాటును మార్చుకోండి.. హ్యీపీ నేషనల్ న్యూట్రిషన్ వీక్..

వ్యాయామం రాజు అయితే పోషణే రాణి.. వాటిని ఒకచోట చేర్చితే.. నీకంటూ ఒక రాజ్యం ఉంటుంది. వీటి కలయిక వల్ల నీ శరీరం ఒక సుసంపన్నమైన రాజ్యంగా వెలుగొందుతుంది. 
 

78
National Nutrition Week

తినడం ప్రతి ఒక్కరూ చేస్తారు.. కానీ తెలివిగా అంటే పోషకాహారాన్ని కేవలం వివేకవంతులే తింటారు.. 

మన శరీరం ఎన్నో రోగాలను తనకు తానుగా నయం చేసుకుంటుంది. దానికి మనం పోషకాహారం అందిస్తే చాలు.. 

మన శరీరానికి ఆహారం ఇందనం మాత్రమే కాదు మన కుటుంబానికి సంబంధించింది.. ఈ సమాజానికి సంబంధించింది.. ఎందుకంటే వీటి వల్లే మనం ఆరోగ్యంగా పదికాలాల పాటు జీవిస్తాం కాబట్టి..
 

88

ఆరోగ్యం ఉన్నవాడికి ఆశ ఉంటుంది.. నిరీక్షణ ఉన్నవాడికి ప్రతిదీ ఉంటుంది - థామస్ కార్లైల్

భవిష్యత్తులో వైద్యులు మనుషులకు మందులతో వైద్యం చేయరు. బదులుగా పోషణతో వ్యాధిని నయం చేస్తారు.. దానిని నిరోధిస్తారు.. - థామస్ ఎడిసన్

ఆరోగ్యకరమైన ఆహారాలు మన జీవితకాలాన్ని పెంచుతాయి  - కరెన్ సెషన్స్
 

click me!

Recommended Stories