మనలో చాలా మందికి నెత్తిమీద రెండు సుడులు ఉంటాయి. కొందరికి ఒక్క సుడే ఉంటుంది. అయితే ఈ రెండు సుడులు ఉన్నవారికి రెండు పెళ్లిళ్లు అవుతాయని చాలా మంది ఆటపట్టిస్తుంటారు. ఇక పళ్లెటూర్లల్లో అయితే.. రెండు సుడులున్న అబ్బాయిలను చూస్తే.. అరే నీకు రెండు పెళ్లిళ్లు అవుతాయిరా అని మజాక్ చేస్తుంటారు. రెండు సుడులు, రెండు పెళ్లిళ్ల గురించి మనం ఎక్కువగా ఊర్లలోనే వింటుంటాం.