అన్నపూర్ణ జయంతి నాడు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే.. అస్సలు మర్చిపోకండి

First Published | Dec 22, 2023, 9:35 AM IST

Annapurna Jayanti 2023: అన్నపూర్ణ జయంతిని ప్రతి సంవత్సరం మార్గశిర్ష పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజు పూజలు చేస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని, ఇంట్లో ఎప్పుడూ ధాన్యం నిండుగా ఉంటుందని నమ్ముతారు. దీనికితోడు అన్నపూర్ణ తల్లి కూడా సంతోషంగా ఉంటుంది. అయితే ఈరోజు కొన్ని పనులు చేయడం నిషిద్ధం. 
 

Annapurna Jayanti 2023: అన్నపూర్ణ జయంతి నాడు పార్వతీదేవిని పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. అన్నపూర్ణ జయంతి మార్గశిర్ష మాసంలోని పౌర్ణమి నాడు వస్తుంది. ఈ సారి అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 26 న వచ్చింది. మార్గశిర్ష పౌర్ణమి నాడు అన్నపూర్ణదేవి పార్వతీదేవి రూపంలో భూలోకంలో అవతరించినట్టు ప్రతీతి. అందుకే ప్రతి సంవత్సరం మార్గశిర్ష పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున పూజలు చేయడం వల్ల సకల బాధలు తొలగిపోతాయని, ఇంట్లో ఆహార ధాన్యాలకు కొదవ ఉండదని నమ్ముతారు. అయితే అన్నపూర్ణ జయంతినాడు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. దీనివల్ల మీరు పూజ చేసిన ఫలితం కూడా పొందరు. మరి అన్నపూర్ణ జయంతి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

అన్నపూర్ణ జయంతి నాడు ఏం చేయాలి?

అన్నపూర్ణ జయంతి నాడు ఉదయాన్నే స్నానమాచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి.

వంటగదిని శుభ్రం చేయాలి. అలాగే గంగా నీటిని చల్లి ఇంటిని శుద్ధి చేయాలి. 

శుభసమయంలో అన్నపూర్ణదేవిని పూజించాలి. 

ఈ రోజున పేదలకు భక్తిశ్రద్ధలతో దానం చేయాలి. 

Latest Videos


అన్నపూర్ణ జయంతి రోజు ఏం చేయకూడదు

అన్నపూర్ణ జయంతి నాడు వంటగదిని మురికిగా ఉంచకూడదు. 

ఈ రోజున తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు.

అలాగే ఆహారాన్ని అవమానించొద్దు.

అన్నపూర్ణ జయంతి నాడు ఉప్పు తినకూడదు.

వాడిని పాత్రలను రాత్రిపూటే క్లీన్ చేయాలి. 

అన్నపూర్ణ జయంతి ప్రాముఖ్యత

అన్నపూర్ణదేవిని ఆహారం, సంపద, సుఖసంతోషాలు, శాంతికి అధిదేవతగా పురాణాలు చెబుతున్నాయి. అన్నపూర్ణ తల్లి ఉన్న ఇల్లు ఎప్పుడూ సుఖసంతోషాలతో నిండి ఉంటుందని నమ్మకం ఉంది. అన్నపూర్ణదేవి ఉన్న ఇంట్లో ఆహార ధాన్యాలతకు కొదవ ఉండదు. మీ ఇంట్లో సుఖసంతోషాలు, ప్రశాంతత నెలకొనాలంటే అన్నపూర్ణ జయంతి నాడు అన్నపూర్ణ మాతను పూజించండి. దీనివల్ల మీ జీవితంలోని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే జీవితంలో ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు.

click me!