హ్యాపీ మదర్స్ డే 2023: అమ్మకు ఇలా విషెస్ చెప్పండి

Published : May 14, 2023, 09:49 AM IST

Mother's Day 2023: అమ్మ గొప్పతనాన్ని చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ లోకంలో నిస్వార్థమైన ప్రేమ ఏదైనా ఉందంటే.. అది అమ్మ ప్రేమే. మరి ఈ రోజు అమ్మకు ఎంతో ప్రత్యేకమైంది.  ఈ రోజున మరి అమ్మకు ఎలా విషెస్ చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
18
హ్యాపీ మదర్స్ డే 2023: అమ్మకు ఇలా విషెస్ చెప్పండి
mothers day

అమ్మ గొప్పతనాన్ని, ప్రేమను, త్యాగాలను గుర్తించడానికి ఒక్కరోజు సరిపోదు. అమ్మ ప్రేమకు ఎవ్వరూ సరితూగరు. ఆమె చేసిన త్యాగాలను ఎవ్వరూ చేయరు. అందుకే అమ్మ స్థానం ఎప్పుడూ అందనంత ఎత్తులోనే ఉంటుంది. పిల్లల జీవితమే తన జీవితంగా బతికే అమ్మకు ఎంత చేసినా తక్కువే. అందుకే అమ్మ గొప్పతనాన్ని, త్యాగాలను గౌరవించడానికి ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా మే 14 వ తేదీన అంటే ఆదివారం నాడు మదర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. మరి అమ్మకు ఈ రోజు ఎలా విషెస్ చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

28
mothers day

ఈ ప్రపంచంలో అత్యంత అద్బుతమైన వాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వేనమ్మా.. నీ ప్రేమ, సంరక్షణ, మద్దతు అన్నీ నాకు చాలా ముఖ్యమైనవి. నా కోసం ఎప్పుడూ నావెంటే ఉన్నందుకు థ్యాంక్స్ అమ్మా..  ఐ లవ్ యూ అమ్మా..

38
mothers day

అందంగా, దృఢంగా, దయగా ఉండే మా అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు. నీ అంతులేని ప్రేమ, అంకితభావంతో ప్రతిరోజూ నన్ను మరింత ముందుకు తీసుకెళుతున్నావు. ఇంత అద్భుతమైన రోల్ మోడల్ గా నిలిచినందుకు ధన్యవాదాలు. హ్యాపీ మదర్స్ డే మామ్..

48
Mothers Day

నన్ను పెంచడానికి నీలా ఎవ్వరూ త్యాగం చేయరు. నీ ప్రేమే నన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దింది. అన్నింటికీ థ్యాంక్స్ మమ్మీ.. హ్యాపీ మదర్స్ డే అమ్మా..

బెస్ట్ అమ్మకు హ్యాపీ మదర్స్ డే. నిస్వార్థమైన నీ ప్రేమే నాకు గొప్ప వరం. ఎన్ని జన్మలకైనా నువ్వే నాకు అమ్మాగా రావాలి..
 

58
Mothers Day

నువ్వే నా మార్గదర్శివి. నువ్వు నా శక్తికి మూలం. నువ్వే నా అతిపెద్ద లీడర్. నిన్ను మా అమ్మగా పిలిపించుకోవడం అదృష్టం.. హ్యాపీ మాదర్స్ డే అమ్మా

నాకోసం ఎంతో కష్టపడ్డావు. పడుతూనే ఉన్నావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. నిన్ను నా తల్లిగా పొందడం నిజంగా నా అదృష్టం. అందమైన అమ్మకు హ్యాపీ మదర్స్ .
 

68

ఇంటా బయటా అందంగా ఉండే అమ్మకు అద్బుతమైన మదర్స్ డే శుభాకాంక్షలు. మీ ప్రేమ, ఆప్యాయత మన ఇంటిని సంతోషనిలయంలా మార్చావు. మన కుటుంబానికి గుండెకాయలా నిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా.. హ్యాపీ మదర్స్ డే

నిస్వార్థమైన ప్రేమ చూపించే మా అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు. నీ కౌగిలింతలు ఏ గాయాన్నైనా ఇట్టే నయం చేస్తాయి. మీ మాటలే మాకు మార్గదర్శకత్వం. ప్రతిరోజూ మీ ప్రేమను మాకు పంచుతున్నందుకు ధన్యవాధాలు. 

78

నా తల్లి ఒక అద్భుతం. – లియోనార్డో డికాప్రియో

అంగీకారం, సహనం, ధైర్యసాహసాలు, కరుణ. ఇవీ మా అమ్మ నేర్పిన విషయాలు. – లేడీ గాగా

తల్లి ప్రేమ ఒక సాధారణ మానవుడు అసాధ్యాన్ని చేయడానికి సహాయపడే ఇంధనం. - మేరియన్ సి.గారెట్టి

దేవుడు అన్ని చోట్లా ఉండలేడు. అందుకే అతను తల్లులను చేశాడు. - రుడ్యార్డ్ కిప్లింగ్

మాతృత్వం: ప్రేమ అంతా అక్కడే ప్రారంభమవుతుంది. ముగుస్తుంది." - రాబర్ట్ బ్రౌనింగ్

88

తల్లి అంటే ఇతరుల స్థానాన్ని ఆక్రమించగలదు కాని ఆమె స్థానాన్ని మరెవరూ ఆక్రమించలేరు. - కార్డినల్ మెర్మిలోడ్

తల్లి చేతులు ఇతరుల కంటే ఎక్కువ ఓదార్పునిస్తాయి. - ప్రిన్సెస్ డయానా

తల్లి ప్రేమ ఒక దీపం లాంటిది. భవిష్యత్తును వెలిగించడమే కాకుండా మధుర జ్ఞాపకాల ముసుగులో గతాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. - హోనరే డి బాల్జాక్

తల్లి: మానవాళి పెదవులపై అత్యంత అందమైన పదం. - కహిల్ జిబ్రాన్ "తన పిల్లల జీవితాలలో తల్లి ప్రభావం లెక్కకు మించినది." - జేమ్స్ ఇ. ఫాస్ట్

click me!

Recommended Stories