
మనలో చాలా మందికి ఫుడ్ ను ఇంకా ఇంకా తినాలన్న కోరికలు కలుగుతుంటాయి. పొట్ట నిండినా ఇంకా ఇంకా తింటుంటారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే అతిగా తినడం వల్ల ఊబకాయం పెరగడమే కాకుండా ఆరోగ్యం ఎన్నో విధాలుగా దెబ్బతింటుంది.
ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మీ నిద్ర ప్రభావితం అవుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అతిగా తినడం వల్ల ఎన్నో జీవనశైలి రుగ్మతలు కూడా వస్తాయి. అందుకే మీరు ఎక్కువగా తినేటప్పుడు మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవాలి. మీరు అతిగా తింటున్నారో లేదో ఎలా తెలుసుకోవచ్చంటే..
గ్యాస్, ఉబ్బరం
ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అలాగే ఆహారాలు పూర్తిగా జీర్ణం కావు, దీని వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. ఎక్కువగా తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. కడుపు ఉబ్బుతుంది.
ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. అతిగా తినడం వల్ల ఎన్నో రోగాల ప్రమాదం పెరుగుతుంది. వీటిలో సర్వసాధారణమైనది ఊబకాయం. దీంతోపాటు గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, స్ట్రోక్, కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఎఎస్ఎ జర్నల్ ప్రకారం.. అవసరానికి మించి ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో కొవ్వు స్థాయి పెరుగుతుంది. దీనివల్ల రక్తపోటు, ఇన్సులిన్ నిరోధకత, మంట వచ్చే ప్రమాదం కూడా ఉంది.
తింటున్నప్పుడు చెమట
మీరు తింటున్నప్పుడు జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. మీరు మీకు అవసరమైన దానికంటే ఎక్కువ తింటుంటే లేదా ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తింటుంటే భోజనం మధ్యలో చెమట పడుతుంది. వేడిగా అనిపిస్తుంది. ఈ సమస్య మీకు ఎప్పుడూ వస్తే వెంటనే మీ ఫుడ్ మొత్తాన్ని తగ్గించండి.
సోమరితనం, నిద్రపోవడం
చాలా మంది అతిగా తిన్న తర్వాత బద్ధకం, సోమరితనం, అలసటగా ఉంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. అతిగా తిన్న తర్వాత రియాక్టివ్ హైపోగ్లైసీమియా వస్తుంది. అంటే మీ రక్తంలో చక్కెర స్థాయి తిన్న తర్వాత అకస్మాత్తుగా పడిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల సోమరితనంగా, నిద్రపోతున్నట్టుగా భావిస్తారు. దీంతోపాటు హార్ట్ రేట్ పెరిగి తలలో నొప్పి వస్తుంది.
ఆకలి నియంత్రణ దెబ్బతింటుంది
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లు రెండూ ఆకలిని నియంత్రిస్తాయి. గ్రెలిన్ మీకు ఆకలిని కలిగిస్తుంది. కాబట్టి లెప్టిన్ ఆకలిని తగ్గిస్తుంది. మీరు ఎక్కువ సేపు ఆకలితో ఉంటే శరీరంలో మంట స్థాయి పెరుగుతుంది. అలాగే మీరు ఆహారం తినేటప్పుడు లెప్టిన్ మీ కడుపు నిండినట్టు చెబుతుంది. అయితే మీరు అతిగా తింటుంటే ఈ రెండు హార్మోన్ల స్థాయి తీవ్రమవుతుంది. దీని వల్ల మీ కోరికలు పెరుగుతాయి. మీకు ఆహారంపై నియంత్రణ ఉండదు.
అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల డోపామైన్ రిలీజ్ అవుతుంది. ఇది మీ మెదడులోని ఆనంద హార్మోన్ ను సక్రియం చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో హార్మోన్ల అసమతుల్యత ఉన్నప్పుడు మనమందరం ఎక్కువ తినడం ప్రారంభిస్తాము. అవసరానికి మించి తినడం వల్ల ఆకలి అనియంత్రితమవుతుంది. దీని వల్ల మనం పోషకాహార లోపాన్ని ఎదుర్కోవలసి వస్తుంది లేదా మనం ఎక్కువ కొవ్వు, కేలరీలను తీసుకుంటాము.
అతిగా తినడాన్ని ఎలా నియంత్రించాలి?
అతిగా తినడాన్ని నియంత్రించడానికి ముందుగా సంతృప్తికరమైన ఆహారాన్ని తినండి. అలాగే అదనపు చక్కెర కలిగిన ఆహారాలు వంటి మీ కోరికలను ప్రేరేపించే ఆహారాలకు దూరంగా ఉండండి. తగినంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోండి. అలాగే సరైన ఆహార ప్రణాళిక చాలా ముఖ్యం. మీరు ఎంత తింటున్నారో చూసుకోండి. ఆకుకూరలు, పండ్లు, ఇతర ఫైబర్ ఎక్కువగా ఉండే ధాన్యాలను మీ దినచర్యలో చేర్చండి. ఇవన్నీ అతిగా తినే సమస్య నుంచి మిమ్మల్ని కాపాడతాయి.