Most Expensive Biryani: ఇప్పటి వరకు చాలా రకాల హైదరాబాద్ బిర్యానీలు రుచి చూసి ఉంటారు. కానీ, అత్యంత కాస్ట్ లీ హైదరాబాద్ బిర్యానీ ఎప్పుడైనా రుచి చూశారా? ఇది ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
హైదరాబాద్ కి చార్మినార్ ఎంత ఫేమసో.. బిర్యానీ కూడా అంతే ఫేమస్. దేశంలో ఎన్నో రకాల బిర్యానీలు ఉన్నా.. హైదరాబాద్ బిర్యానీ తర్వాతే ఏదైనా . దీని రుచి మరే బిర్యానీకి రాదు. అయితే.. ఈ హైదరాబాద్ మహా నగరంలో ఏ సందుకి వెళ్లినా మనకు బిర్యానీ దొరికేస్తుంది. ఒక్కో బిర్యానీ ఒక్కో రుచి ఉంటుంది. ఒక్కో ధరలో కూడా దొరుకుతుంది. చిన్న హోటల్ అయితే.. రూ.100 కి కూడా దొరికేస్తుంది.. అదే కాస్త కాస్ట్ లీ రెస్టారెంట్ అయితే.. రూ.500 నుంచి రూ.600 వరకు ఉంటుంది. కానీ.. రూ.20వేలు ఖరీదు చేసే.. హైదరాబాద్ బిర్యానీ ఎప్పుడైనా రుచి చూశారా? అత్యంత ఖరీదైన ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది? దీనికి అంత రేటు ఎందుకు..? ఇప్పుడు చూద్దాం..
23
ఈ బిర్యానీకి అంత ఖరీదు ఎందుకు..?
దుబాయిలోని ఓ రెస్టారెంట్ లో అత్యంత ఖరీదైన హైదరాబాద్ బిర్యానీ అమ్ముతున్నారు. అక్కడ ప్లేట్ బిర్యానీ 1000దీరమ్స్. అంటే.. మన కరెన్సీలో దాదాపు రూ.20వేలు పైనే ఉంటుంది. బాంబే బరో అనే రెస్టారెంట్ స్పెషల్ గా ఈ బిర్యానీ ని తన కస్టమర్స్ కి అందిస్తోంది. బిర్యానీ అంత రేటు ఎందుకు ఉంది అనే సందేహం వస్తోందా? ఆ బిర్యానీలో బంగారం కలుపుతారు.
మీరు చదివింది నిజమే... ఈ బిర్యానీ తయారీలో 23 క్యారెట్ గోల్డ్ కలుపుతారు. అది తినగలిగే బంగారు రేకులు కావడం విశేషం. బిర్యానీలో బంగారం కలపడం వల్ల దాని ధర అంత ఎక్కువగా ఉంది. బిర్యానీ అంటే.. కేవలం.. రైస్, మధ్యలో చికెన్ ముక్కలు రావడం కాదు.. వీరు దీనిని చాలా స్పెషల్ గా అందిస్తారు. ఈ బిర్యానీ తయారీలో కుంకుమ పువ్వు కూడా కలుపుతారు. ఇక.. బిర్యానీపైన బంగారు ఆకుల పూత ఉన్న కబాబ్, కాశ్మీరీ ల్యాంబ్ సీఖ్ కబాబ్, ఓల్డ్ ఢిల్లీ ల్యాంబ్ చాప్స్, రాజ్ పుత్ చికెన్ కబాబ్, మొఘలాయ్ కోఫ్తా, మలై చికెన్ ఇవన్నీ కలిపి వడ్డిస్తారు. వీటితో పాటు రకరకాల సాస్ లు, రైతులు కూడా ఇస్తారు.
33
గోల్డెన్ బిర్యానీ...
ఈ బిర్యానీ గోల్డ్ బిర్యానీ అని పిలుస్తారు. దీనిని ఆర్డర్ ఇచ్చిన 45 నిమిషాల తర్వాత.. మన ముందుకు వస్తుంది. ఒక్క బిర్యానీ ఆర్డర్ చేస్తే 4 నుంచి 6 మంది హ్యాపీగా తినేయచ్చు. ఇక.. ఈ రెస్టారెంట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ లో ఉంది. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ మాత్రమే కాదు.. ఇంటీరియర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. లోపలికి అడుగుపెడితే.. బ్రిటీష్ కాలంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఇక.. మన హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన బిర్యానీ రుచి చూడాలి అంటే.. తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లేదా.. ది వెస్టిన్ లోని ప్రోగో రెస్టారెంట్ లో అడుగుపెట్టాలి. ఇక్కడ కూడా.. మీరు చాలా ఖరీదైన ఆహారాలను చూస్తారు. కేవలం ఫుడ్ మాత్రమే కాదు.. ఈ ప్యాలెస్ చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.