మంకీపాక్స్: మంకీపాక్స్ వైరస్ గురించి మనం అనుకునే కొన్ని అపోహలు.. అసలు నిజాలు..

First Published Aug 21, 2022, 10:46 AM IST

మంకీపాక్స్: మంకీపాక్స్ వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తుంది. అందుకే జనాలు దీని గురించి ఉన్నవి లేనివి అన్నీ ఊహించుకుంటూ మరింత టెన్షన్ పడుతున్నారు. 

మంకీపాక్స్ ఈ మధ్య పుట్టుకొచ్చింది కాదు. దీనిని మొదటి సారిగా 1970 లో గుర్తించారు. కానీ ఇది ఈ ఏడాది మేలో గుర్తించబడి.. తుఫానుగా మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర సమస్యగా ప్రకటించింది. అయితే ఈ వ్యాధి గురించి జనాలకు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల దీనిగురించి ఎన్నో అపోహలు ఊహించుకుంటున్నారు. మరి ఈ మంకీపాక్స్ గురించి జనాలు అనుకుంటున్న అపోహలు, వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

అపోహ 1: మంకీపాక్స్ కొత్త వైరస్

మంకీపాక్స్  ప్రస్తుతం చాలా దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ఇది ప్రజలను దారుణంగా భయపడుతుంది. ఈ భయం కోవిడ్ మూలంగానే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే కోవిడ్ కొత్త వైరస్ కావడం. దీని వల్ల ఎంతో మంది చనిపోవడం.. దీనిలక్షణాలు నెలలు, సంవత్సరాల పాటు ఉండటం వల్ల జనాల్లో ఈ భయం పుట్టుకొచ్చింది. ఇకపోతే మనం అందరం అనుకుంటున్నట్టు మంకీపాక్స్ కొత్త వైరస్ అయితే కాదు. దీనిని మొట్టమొదటి సారి 1970 లో గుర్తించారు. ఈ వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకోవడం వల్ల మంకీపాక్స్ సంక్రమణను తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 

అపోహ 2: మంకీపాక్స్ ను మందులతో తగ్గించుకోలేము.. 

సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలా మంది మంకీపాక్స్ మందులతో తగ్గదని గట్టిగా ఫిక్స్ అయ్యారు. నిజానికి ఇది పూర్తిగా తప్పు. అయితే మంకీపాక్స్ 2 నుంచి 4 వారాల్లో దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. అయితే కొన్ని రకాల మందులతో మంకీపాక్స్ లక్షణాలను తగ్గించుకోవచ్చు. ఈ మెడిసిన్స్ తో పాటుగా హెల్తీ ఫుడ్, ద్రవాలను తీసుకుంటే కూడా దీని నుంచి త్వరగా కోలుకుంటారని నిరూపించబడింది.  

అపోహ 3:  మంకీపాక్స్ స్వలింగ సంపర్క సంబంధాల ద్వారే సోకుతుంది.. 

ఎయిడ్స్ , హెచ్ఐవి లాగే మంకీపాక్స్ కూడా బైసెక్సువల్, గే పురుషుల వల్లే ఈ వ్యాధి వ్యాపిస్తుందనే వాధన గట్టిగా వినబడుతోంది. స్వలింగ సంపర్కం ద్వారా ఇది వ్యాప్తిచెందుతన్నప్పటికీ కేవలం వీరివల్లే వ్యాపిస్తుందనేది మాత్రం పూర్తిగా అవాస్తవం అంటున్నారు నిపుణులు. మంకీపాక్స్ వీర్యం, ఉమ్ము, ఇతర విసర్జన ల ద్వారా కూడా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ సోకిన వారితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఇది సోకుతుంది. మొత్తంలో మంకీపాక్స్ వచ్చినవారితో సన్నిహితంగా మెలిగినా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. 
 

monkeypox virus

అపోహ 4: మంకీపాక్స్ కోతుల ద్వారా వ్యాప్తిచెందుతుంది

ఇది వీటి ద్వారే సోకుంతుందనే దానిలో నిర్ధిష్ట నిజం ఉన్నప్పటికీ.. ఈ మంకీపాక్స్ సంక్రమణకు మూలం కోతులే అనడంలో నిజం లేదంటున్నారు నిపుణులు. ఇది కోతుల వల్లే సోకుంతుందని గుర్తించినప్పటికీ.. ఉడుతలు, ఎలుకలు, మనుషుల నుంచి కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ మంకీపాక్స్ బారిన పడకూడదంటే.. మంకీపాక్స్ లక్షణాలున్న మనుషులకు, ఈ జంతువులకు దూరంగా ఉండాలి. 
 

అపోహ 5: మంకీపాక్స్ గాలిలో తిరుగుతుంది

మంకీపాక్స్ మహమ్మారి వల్ల జనాలకు ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చింది. దీనిలాగే మంకీపాక్స్ కూడా గాల్లో తిరుగుతుందని భావిస్తున్నారు. నిజానికి ఈ రెండిలో  ఎలాంటి పోలికలు లేవు. వాస్తవం ఏమిటంటే ఇది గాలి ద్వారా వ్యాపించదు. కేవలం మంకీపాక్స్ ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉంటేనే సోకుతుంది. ముఖ్యంగా మంకీపాక్స్ ఉన్నవారితో శారరీక సంపర్కాన్ని నివారించడం మంచిది. 

click me!