Money Plant: మనీ ప్లాంట్ సరిగా పెరగడం లేదా? ఇదొక్కటి వేస్తే.. మొక్క వేగంగా పెరుగుతుంది..!

Published : Nov 03, 2026, 05:58 PM IST

Money Plant: మనీ ప్లాంట్ పెంచుతున్నారా? వేగంగా పెరగడం లేదా? అయితే.. మీరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కిచెన్ లో లభించే కొన్నింటిని వాడటం వల్ల వేగంగా పెరుగుతుంది.

PREV
13
Money Plant Tips

ఇంట్లో మనీ ప్లాంట్ ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాకుండా, ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే చాలామంది తమ ఇళ్లలో కుండీల్లో లేదా అందమైన గాజు సీసాల్లో నీళ్లు పోసి మనీ ప్లాంట్‌ను పెంచుకుంటారు. అయితే ఎంత శ్రద్ధగా చూసుకున్నా, శుభ్రమైన నీరు పోసినా కొన్నిసార్లు మనీ ప్లాంట్ తీగలు పెరగక, ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతుంటాయి. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఎండిపోవడం శుభపరిణామం కాదు.

మరి మీ ఇంట్లోని మనీ ప్లాంట్ కూడా సరిగ్గా పెరగడం లేదా? అయితే నిరాశపడకండి. మన వంటగదిలో ఉండే ఒక్క మసాలా దినుసుతో ఎండిపోతున్న మనీ ప్లాంట్‌కు మళ్లీ ప్రాణం పోయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

23
1. నీటిలో పెంచే మనీ ప్లాంట్ కోసం ఈ చిన్న చిట్కా:

మీరు గాజు సీసా లేదా బాటిల్‌లో నీళ్లు పోసి మనీ ప్లాంట్ పెంచుతున్నట్లయితే, ఆ నీటిలో అనాస పువ్వు ముక్కను వేయండి. ఈ మసాలా దినుసులోని సహజసిద్ధమైన పోషకాలు నీటిలో కలిసి, మనీ ప్లాంట్ వేళ్లకు బలాన్ని అందిస్తాయి. దీనివల్ల వేగంగా కొత్త ఆకులు వస్తాయి.

గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. వారానికి ఒకసారి ఖచ్చితంగా బాటిల్‌లోని నీటిని మార్చాలి. నీటిని మార్చిన ప్రతిసారి పాత స్టార్ అనైస్‌ను తీసేసి, కొత్తది వేయడం మర్చిపోవద్దు.

33
2. కుండీలో (మట్టిలో) పెంచే మనీ ప్లాంట్ కోసం:

ఒకవేళ మీరు మనీ ప్లాంట్‌ను కుండీలో పెంచుతుంటే.. అనాస పువ్వును బాగా నలిపి పొడిలా చేసి, మొక్క కాండం మొదట్లో చల్లండి. దానిపైన కొద్దిగా మట్టి వేసి తేలికగా నీరు చల్లాలి. ఈ పొడిలోని మూలకాలు మట్టిలో కలిసి వేళ్లకు మంచి ఎరువుగా పనిచేస్తాయి. మనీ ప్లాంట్ నాటేటప్పుడు మట్టిలో కొద్దిగా ఇసుక , కొబ్బరి పీచు పొడి (Coco Peat) కలిపితే వేళ్లు చక్కగా విస్తరించి మొక్క బలంగా పెరుగుతుంది.

3. సూర్యరశ్మి విషయంలో ఈ పొరపాటు చేయకండి.. 

మనీ ప్లాంట్ పెరిగే వాతావరణం కూడా చాలా ముఖ్యం. చాలామంది మొక్క త్వరగా పెరగాలని నేరుగా ఎండలో పెడుతుంటారు. మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ప్రత్యక్ష సూర్యరశ్మి తగిలేలా ఉంచకూడదు. తీవ్రమైన ఎండ వల్ల ఆకులు పసుపుగా మారి ఎండిపోతాయి. కిటికీల దగ్గర లేదా ఇంట్లో వెలుతురు పరోక్షంగా వచ్చే నీడ పట్టున ఉంచితే మనీ ప్లాంట్ పచ్చగా, దట్టంగా పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories