muharram 2022: మొహర్రం రోజున ముస్లింలు రక్తాన్ని చిందించేది ఇందుకే..

Published : Aug 02, 2022, 04:58 PM IST

muharram 2022: రంజాన్ తర్వాత ముస్లింలు జరుపుకునే పండుగల్లో మొహర్రం ఒకటి. అసలే దీన్ని పండుగే అనరు. మొహర్రం పదో రోజున ముస్లిం యువకులంతా చేతులతో గుండెలను బాదుకుంటూ రక్తాన్ని చిందిస్తారు. ఇలా చేయడానికి కారణమేంటో తెలుసా..? 

PREV
15
muharram 2022: మొహర్రం రోజున ముస్లింలు రక్తాన్ని చిందించేది ఇందుకే..

మొహరం పండుగనే  పీర్ల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ ముస్లింలకు ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే దీన్ని త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు బ్లేడ్లను తీసుకుని శరీరానికి గాయాలు చేసుకుంటూ రక్తాన్ని చిందిస్తారు. అందుకే దీన్ని పండుగ అనరు. దీన్ని సంతాప దినంలాగే ముస్లిం లు జరుపుకుంటారు. 
 

25

మొహర్రం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఇనామ్ హుస్సేన్. మహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్ ఇస్లాం మతాన్ని కాపాడటం కోసం ఎంతో కృషి చేస్తాడు. ఇస్లాం గురించి కర్బలా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ అమరుడవుతాడు. 14 శతాబ్దాల క్రితం మొహర్రం 10వ రోజున జరిగిన కర్బలా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ ను క్రూర పాలకుడు, నియంత అయిన యాజీద్ సైన్యం నిర్దాక్షిణ్యంగా హతమార్చింది. కాగా ఈ పవిత్ర మాసంలోనే హుస్సేన్ ప్రాణత్యాగం చేస్తాడు. అతని జ్ఞాపకార్థం ముస్లింలు సంతాప దినాలను పది రోజుల పాటు నిర్వహిస్తారు.
 

35

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ కొత్త ఏడాది మొహర్రంతోనే మొదలవుతుంది. క్రీ.శ 622 లో మొదటి ఇస్లామిక్ రాజ్యం స్థాపనకు గుర్తుంగా ఈ నెల గుర్తింపు పొందింది. 

45

అమరులైన వారికి ఆత్మ శాంతించాలని ప్రార్థనలు చేస్తూ ముస్లింలు ఉపవాసాలు ఉంటారు. అంతేకాదు షియా ముస్లింలు బ్లాక్ డ్రెస్ ను వేసుకుని..చేతులతో గుండెలపై బాధుకుంటూ గట్టిగట్టిగా ఏడుస్తారు. బ్లేడ్లతో శరీరాన్ని గాయం చేసుకుంటూ రక్తాన్ని చిందిస్తారు. కొరడాలతో కొట్టుకోవడమే కాదు.. నిప్పుల గుండాల్లో కూడా నడుస్తారు.  అయితే ఇలా రక్తాన్ని చిందించడం వల్ల అల్లాహ్ మోక్షం లభిస్తుందని కొంతమంది నమ్ముతారు.

55

ఏదేమైనా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్ అమరుడైనా.. దయ, సమానత్వం, సమన్యాయం అతని సందేశాలతో  నేటికీ ప్రజల మధ్యన జీవిస్తున్నాడని ముస్లింలు విశ్వసిస్తారు. 

Read more Photos on
click me!

Recommended Stories