Belly Fat: ఈ పండ్లను తింటే బెల్లీ ఫ్యాట్ ఫాస్ట్ గా తగ్గిపోతుంది తెలుసా

First Published Aug 2, 2022, 3:56 PM IST

Belly Fat: బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవాలనుకునే వారు.. రోజు వారి ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

బరువు తగ్గేందుకు ఒక్కక్కరూ ఒక్కో పద్దతిని ఫాలో అవుతుంటారు. కొంతమంది తినడాన్ని తగ్గిస్తే మరికొంతమంది జిమ్ముల్లో గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు తగ్గే ప్రాసెస్ మాత్రం కొంచెం నెమ్మదిగానే సాగుతుంది. అయినప్పటికీ.. బరువు తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ప్రోటీన్ ఫుడ్ ను తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడో ఒకసారి వ్యాయామాలను చేస్తే బరువు అసలే తగ్గరు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. తినకుండా ఉండటం, ఆకలితో పస్తులుండటం వంటివి చేయకూడదు. ఈ అలవాట్లు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఎందుకంటే వీటి వల్ల మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. దీనివల్ల మీ శరీరం మరింత బలహీనంగా మారుతుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలంటే ఈ ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో ఖచ్చితంగా చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కివి (Kiwi)

కివి బెల్లీ ఫ్యాట్ ను కరిగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఆకలిని తగ్గించే ఫైబర్ తో పాటుగా విటమిన్ ఇ, ఫోలేట్, విటమిన్ సిలు  పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా.. తిన్న ఆహారం తొందరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. ఇక ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. స్వీట్లను తినాలనే కోరికలను  తగ్గిస్తుంది. 
 

ఆపిల్స్ (Apples)

రోజూ ఒక యాపిల్స్ ను తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. వీటిని తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా వేగంగా కరిగిపోతుందన్న విషయం మీకు తెలుసా..? ఎందుకంటే ఆపిల్స్ లో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బరువును తగ్గించడానికి కూడా సహాయడుతుంది. 
 

బొప్పాయి (papaya)

బొప్పాయి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఔషద గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఆకలిని నియంత్రించి.. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా సహాయపడుతుంది. ఫాస్ట్ గా బరువును, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. 
 

click me!