Mint Tea Benefits: వేసవిలో పుదీనా టీ తాగితే ఒంట్లో వేడి తగ్గడమే కాదు.. బరువు కూడా తగ్గుతారు..

Published : May 09, 2022, 05:02 PM IST

Mint Tea Benefits: వేసవిలో పుదీనా టీ తాగడం వల్ల మీ బాడీ కూల్ గా ఉండటమే కాదు.. ఈ సీజన్ లో వచ్చే తలనొప్పి కూడా తగ్గుతుంది. అంతేకాదు..   

PREV
16
Mint Tea Benefits: వేసవిలో పుదీనా టీ తాగితే ఒంట్లో వేడి తగ్గడమే కాదు.. బరువు కూడా తగ్గుతారు..

Mint Tea Benefits: వేసవిలో చాలా మంది టీకి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఈ సీజన్ లో టీని తాగడం వల్ల శరీరంలో వేడి పెరిగిపోతుందని. కానీ పుదీనా టీ మాత్రం శరీరంలో వేడిని ఏ మాత్రం పెంచదు గాక పెంచదు. అంతేకాదు ఇది  మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. 

26

పుదీనాలో చలువ చేసే గుణాలుంటాయి. అందుకే ఈ సీజన్ లో పుదీనాను తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా టీకి దూరంగా ఉండేవాళ్లు పుదీనా టీని తాగొచ్చు. ఇది తక్కువ వేడిని కలిగించడమే కాకుండా అలసటను కూడా తొలగిస్తుంది. మరి ఈ టీని తాగడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

36

శరీరం చల్లబడుతుంది.. పుదీనాలో శరీరాన్ని చల్లబరిచే గుణాలుంటాయి. పుదీనా ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఫాస్పరస్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. ఇది హిమోగ్లోబిన్ లెవెల్స్ ను మెరుగుపరుస్తాయి. అతేకాదు మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 

46

వేడి వల్ల కలిగే తలనొప్పి తగ్గుతుంది.. వేసవిలో చాలా మందిని  వేధించే సమస్య  తలనొప్పి. అయితే ఈ తలనొప్పి వల్ల మీరు బలహీనంగా మారడమే కాదు.. అలసట కూడా వస్తుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం పుదీనా టీ. 
 

56

బరువు తగ్గుతారు.. బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్ గా పుదీనా టీని తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. వాస్తవానికి దీనిలో కేలరీలు చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీరు చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. 
 

66

పుదీనా టీని తయారుచేసే పద్దతి.. ముందుగా 6 నుంచి 7 పుదీనా ఆకులను తీసుకుని వాటిని నీట్ గా కడగాలి. ఆ తర్వాత గ్యాస్ మీద కొన్ని నీళ్లను వేడి చేయండి. నీళ్లు బాగా వేడి అయ్యాకా.. అందులో పుదీనా ఆకులను వేయండి. అది బాగా మసిలిన తర్వాత వడగట్టి తాగేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories