Savings Tips: ఏసీ వాడినా.. కరెంట్ బిల్లును తగ్గించే ట్రిక్స్ ఇవిగో..

Published : May 09, 2022, 03:31 PM IST

Savings Tips: ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక ఈ ఎండలకు ఫ్యాన్లు, ఏసీలు లేకుండా క్షణం కాలం కూడా ఉండలేము. అయితే వీటిని విచ్చల విడిగా వాడటం వల్ల కరెంట్ బిల్లు తడిసి మోపెడు అవుతుందని జనాలు బయటపడుతుంటారు. అయితే కొన్ని ట్రిక్స్ ను ఫాలో అయితే కరెండ్ బిల్లు తగ్గుతుంది. 

PREV
17
Savings Tips: ఏసీ వాడినా.. కరెంట్ బిల్లును తగ్గించే ట్రిక్స్ ఇవిగో..

Savings Tips: మండుతున్న ఎండలకు ఏసీలను, ఫ్యాన్లు వాడకుండా ఉండటం చాలా కష్టం. అందులోనూ ప్రస్తుతం చాలా మంది ఏసీలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ వీటి వాడకం వల్ల కరెంట్ బిల్లు తడిసి మోపెడు అవుతుంది. అలా ఎందుకు జరుగుతుంది.. దానిని ఎలా తగ్గించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
 

27

ఏసీని సర్వీస్ చేయడం.. ఏసీని మోతాదుగా వాడుతున్నట్టైతే..  దానిని ఒక సీజన్ లో ఒకసారి సర్వీసింగ్ కు ఇవ్వండి.  దీంతో మీ ఏసీ ఎక్కువ రోజులు పనిచేయడమే కాదు.. కరెంటు బిల్లును కూడా తగ్గిస్తుంది.

37

ఒకవేళ మీరు ఏసీని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టైతే ప్రతి మూడు నెలలకు ఒక సారీ సర్వీసింగ్ కు ఇవ్వండి. ఈ సర్వీసింగ్ లో ఏసీ లోని కాయిల్స్ క్లియర్ చేయడబడతాయి. అలాగే  ఓల్జేజ్ కనెక్షన్, కూలెంట్ లెవెల్స్ కూడా చెక్ చేయబడతాయి. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. 

47

టైమర్.. విద్యుత్ ను ఆదా చేయడం కోసం అనేక సార్లు ప్రజలు తమ ఏసీని ఆఫ్ చేసి, స్విచ్ ఆన్ చేస్తుంటారు. దీనికి బదులుగా టైమర్ ను సెట్ చేయొచ్చు. ఇది తక్కువ సమయంలో ఏసీని ఆటోమెటిక్ గా ఆఫ్ చేస్తుంది. 

57

ఎయిర్ ను కండీషన్ లో ఉంచడం.. అంటే ఏసీ రూమ్ కు చేరుకున్న వెంటనే దానిని ఆఫ్ చేయడానికి టెంపరేచర్ ను సెట్ చేయడమని అర్థం. ఉదాహరణకు 24 డిగ్రీల కటాఫ్ ఉష్ణోగ్రత వద్ద ఏసీ కలిగి ఉండటం వల్ల ఏసీ 24 డిగ్రీల సెల్సియస్ అయిన వెంటనే ఆఫ్ అవుతుంది. గది ఉష్ణోగ్రత పెరుగుతుందన్నప్పుడు అది ఆటోమేటిక్ గా కంప్రెసర్ ను ప్రారంభిస్తుంది.
 

67

ACలోని ఎయిర్ ఫిల్టర్‌లు HVAC సిస్టమ్ నుండి దుమ్మను, ధూళిని దూరంగా ఉంచుతాయి కాబట్టి దీనిని సులువుగా ఉపయోగించవచ్చు. అయితే ఎయిర్ ఫిల్టర్ దుమ్ముని, ధూళిని స్టోర్ చేసుకుంటుంది. దీంతో అది మురికిగా మారుతుంది. దీనిని శుభ్రం చేయకపోతే ఏసీ కరాబయ్యే అవకాశం ఉంది. అందుకే ఏసీ ఫిల్టర్ ను నీటితో తుడవండి. 
 

77

సూర్యకిరణాలు లోపలికి రానీయకండి.. ఉదయం పూట కాసేపు సూర్మరశ్మిలో ఉండటం వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది. కానీ వేసవిలో సూర్యకిరణాలు మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. సూర్యకిరణాల వల్ల హీట్ స్ట్రోక్, వడదెబ్బ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అసలు విషయానికొస్తే సూర్యకిరణాలు గదిలోకి వస్తే గది తొందరగా చల్లబడదు. చల్లబడటానికి ఎక్కువ సమయం పడతుంది. దీంతో మీ కరెంట్ బిల్లు పెరిగిపోతుంది. 

click me!

Recommended Stories