ఎముకలు బలంగా ఉండాలంటే పాలు ఒక్కటే చాలదు.. ఇవి కూడా తీసుకోవాల్సిందే..

Published : Apr 10, 2022, 04:24 PM IST

ఎముకలు బలంగా ఉండాలంటే పాలతో పాటుగా.. బాదం పప్పులు, రాగులు, చియా విత్తనాలు, పెరుగును కూడా తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన కాల్షియం లభించి ఎముకలు బలంగా, ధ్రుడంగా ఉంటాయి.   

PREV
17
ఎముకలు బలంగా ఉండాలంటే పాలు ఒక్కటే చాలదు.. ఇవి కూడా తీసుకోవాల్సిందే..

మన ఎముకలను బలంగా ఉంచేందుకు కాల్షియం ఎంతో అవసరం. అందుకే కాల్షియం ఉండే పాలను ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి కూడా. అయితే కొంతమందికి పాలంటే అస్సలు ఇష్టముండదు. దాంతో వారు పాలను పక్కన పెట్టేస్తుంటారు. ఇలాంటి వారికి కాల్షియం లోపం ఏర్పడవచ్చు. అయితే పాలను తాగేవారైనా.. తాగని వారైనా.. మీ శరీరానికి కావాల్సిన కాల్షియం అందాలంటే మాత్రం పాలతో పాటుగా వీటిని కూడా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27

టోఫు.. ఈ టోపు మార్కెట్లలో సులభంగా లభిస్తాయి. 200 గ్రాముల టోఫు లో 700 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది అచ్చం జున్ను మాదిరిగానే కనిపిస్తుంది. దీన్ని సలాడ్ తో లేదా కూరయాలతో కలిపి ఆహారంలో తీసుకోవచ్చు. టోఫులో మెగ్నీషియం, ప్రోటీన్, ఫాస్పరస్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

37

బాదం పప్పులు.. బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక బాదం పప్పును తింటే మన శరీరానికి 300 మి.గ్రా కాల్షియం అందుతుంది. ఆ బాదం పప్పులను నానబెట్టి తింటే మరింత మంచిది. ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులు తింటే చాలు మీ శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. 

47

పెరుగు.. పాలు నచ్చని వారు పెరుగు తిన్నా కాల్షియం లోపం ఏర్పడదు. ఒక కప్పు పెరుగు తింటే 300 నుంచి 350 మి.గ్రా కాల్షియం అందుతుంది. ఈ పెరుగును బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ ఇలా ఏ సమయంలోనైనా తినొచ్చు. 
 

57

కొమ్ము శెనగలు.. కొమ్ము శెనగలతో కూర లేదా వేపుడు చేసుకుని తినొచ్చు. 2 కప్పుల కొమ్ము శెనగలలో 420 మి. గ్రా. కాల్షియం ఉంటుంది. వీటిలో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది. 

67

చియా సీడ్స్.. ఈ చియా సీడ్స్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతాయి. ప్రతిరోజూ వీటిని నాలుగు టీస్పూన్లు తీసుకుంటే 350 మి.గ్రా కాల్షియం అందుతుంది. వీటిని గంటపాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత  ఆ నీటిని తాగి.. ఆ సీడ్స్ తో స్మూతీలను చేసుకుని తాగితే మీ శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. 

77

రాగిపిండి.. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. 100 గ్రా. రాగి పిండిని తీసుకుంటే 345 మి.గ్రా కాల్షియం అందుతుంది. వారానికి మూడు నాలుగు సార్లు రాగులను ఏదో ఒక రూపంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

click me!

Recommended Stories