
Migraine: ప్రస్తుత కాలంలో మైగ్రేన్ సమస్య సర్వసాధారణం అయ్యింది. ఈ మైగ్రేన్ నాడీ సంబంధ ప్రాబ్లం. ఈ నొప్పి తల ఒక వైపు మాత్రమే వస్తుంది. కానీ ఈ నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. ఇది ఒక సారి వచ్చిందంటే దాదాపుగా 4 గంటల నుంచి 72 గంటల వరకు వేధించే అవకాశం ఉంది. ఈ సమస్య పురులకంటే స్త్రీలకే ఎక్కువగా సోకే అవకాశముందని పలు సర్వేలు స్పష్టం చేశాయి.
ఈ సమస్యతో బాధపడే వారు వికారం, వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సమస్య రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిద్రలేమి.. ఈ ఆధునిక కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ నిద్రలేమి కారణంగా తలనొప్పి మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కంటినిండ నిద్రలేకపోవడం వల్ల మీరు బలహీనంగా మారడమే కాదు అలసటగా కూడా ఉంటారు. తిన్న ఆహారం తొందరగా అరగకపోతే మన శరీంరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చివరకు ఇది మైగ్రేన్ సమస్యకు దారి తీస్తుంది.
ఒత్తిడి, ఆందోళన.. ఈ గజిబిజీ లైఫ్ లో అందోళన, ఒత్తిడి సమస్యలు లేని వారంటూ లేరనడంలో ఎలాంటి సందేహం లేదంటారు నిపుణులు. అయితే ఈ రెండు సమస్యల వల్ల మైగ్రేన్ సమస్య మరింత పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. టెన్షన్, పనుల ఒత్తిడి ఎక్కువైతే ఖచ్చితంగా తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తలనొప్పి చివరకు మైగ్రేన్ సమస్యకు దారి తీస్తుంది.
గ్యాస్ లేదా యాసిడ్ సమస్య ఉండటం.. గ్యాస్ లేదా యాసిడ్ సమస్యలను ఎదుర్కొనే వారు కూడా మైగ్రేన్ సమస్య బారిన పడొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమస్యలున్న వారు తలనొప్పి సమయంలో వాంతులు చేసుకునే అవకాశం ఉందట. ఇలాంటి వాల్లు గ్యాస్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీకోకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా వీళ్లు కడుపును ఖాళీగా మాత్రం ఉంచకూడదు. లేకపోతే గ్యాస్ వచ్చే అవకాశం ఉంది.
ఎండవేడి..మైగ్రేన్ నొప్పి ఈ మండుతున్న ఎండలకు కూడా ఎక్కువ అవుతుంది. ఎండకు వెళ్లి తిరిగి ఏసీ లో ఉంటే మైగ్రేన్ సమస్య వస్తుంది. ముఖ్యంగా విపరీతమైన వేడి వల్ల కూడా తలనొప్పి, మైగ్రేన్ నొప్పి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
మైగ్రేన్ తగ్గాలంటే తాజా పండ్లు, జున్ను, మామిడి పండ్లు, పుచ్చకాయలు, దోసకాయలు, ఆకు కూరలు, కాఫీ, రెడ్ వైన్ వంటివి తీసుకోండి. ఈ ఫుడ్స్ మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
తీవ్రమైన మైగ్రేన్ సమస్య తో బాధపడుతున్నప్పుడు ఎలాంటి పనులు పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకోండి. చీకటి, నిశ్శబ్దంగా ఉండే గదిలో ఉండాలి. అప్పుడే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే గ్లాస్ వాటర్ తాగి.. తలకు కోల్డ్ కంప్రెస్ అప్లై చేయండి. అలాగే పారాసిటమాల్, డైక్లోఫెనాల్ లేదా నాప్రోక్సెన్ వంటివి మందులను లేదా డాక్టర్ సూచించిన టాబ్లెట్లను వేసుకోండి.