అజీర్థి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? మీ డైట్ లో వీటిని చేర్చండి.. వెంటనే ఉపశమనం లభిస్తుంది

Published : Apr 25, 2022, 01:39 PM IST

Indigestion Problem: మన జీర్ణవ్యవస్థ ఎంత బలంగా ఉంటే మన ఆరోగ్యం అంత బావుంటుందని నిపుణులు చెబుతుంటారు. మలబద్దకం లేదా కడుపులో గ్యాస్ సమస్యలు వస్తే మాత్రం మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా లేదని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. 

PREV
17
అజీర్థి సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? మీ డైట్ లో వీటిని చేర్చండి.. వెంటనే ఉపశమనం లభిస్తుంది

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన జీర్ణక్రియ కూడా అంత ఆరోగ్యంగా ఉండాలంటారు నిపుణులు. అయితే ప్రస్తుత కాలంలో అజీర్థి, మలబద్దకం, కడుపులో గ్యాస్ వంటి సమస్యలను చాలా మందే ఎదుర్కొంటున్నారు. ఇది పేలవమైన జీర్ణక్రియకు సంకేతమంటున్నారు నిపుణులు. 

27

వాంతులు, చెడు జీవన శైలి, నిద్రరాకపోవడం వంటివి జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల విరేచనాలు, అజీర్థి, మలబద్దకం వంటి సమస్యలు ఎదురవుతాయి. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు సమతుల్య ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

37

బొప్పాయి.. బొప్పాయి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును అల్పాహారంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో పపైన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది. 

47

ఆపిల్ పండు.. జీర్ణవ్యవస్థకు ఆపిల్ పండు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఎన్నో ఖనిజాలు, పొటాషియం కూడా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

57

దోసకాయ.. కీరదోసలో ఎరెప్సిన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతేకాదు  ఇది కడుపులో గ్యాస్, పెప్టిక్ అల్సర్, గ్యాస్ట్రిక్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

67

అరటి, దానిమ్మ పండు.. అరటిపండు, దానిమ్మ పండ్లు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

77

నిమ్మకాయ-తేనె.. గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ రసాన్ని కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు దీంతో మీరు బరువు కూడా తగ్గుతారు. 
 

click me!

Recommended Stories