Mangoes: మామిడి పండ్లను రాత్రిపూట తినకూడదా..?

First Published May 21, 2022, 4:56 PM IST

Mangoes: మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. ఇంకేముంది ఇక ఇష్టమున్నన్ని లాగించొచ్చు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మామిడి పండ్లను కొన్ని సమయాల్లో అస్సలు తినకూడదు. 
 

Mangoes: వేసవి వచ్చిందంటే చాలు  మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. అందులోనూ ఈ పండ్లు ఈ సీజన్ పోతే మళ్లీ మళ్లొచ్చే సీజన్ దాకా వెయిట్ చేయాలి. అలా అని చాలా మంది మామిడి పండ్లను దొరికిందే తడవుగా మోతాదుకు మించి లాగించేస్తుంటారు. కానీ మామిడి పండ్లను మోతాదులోనే తినాలి. లేదంటే ఒంట్లో వేడి పెరగడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

Mangoes

ఇక ఉదయం ఆఫీసులకు, వివిధ పనులుకు వెళ్లేవారు మామిడి పండ్లను రాత్రి పూట మాత్రమే తింటుంటారు. ఉదయం సమయం లేకపోవడం వల్ల ఇలా తింటుంటారు. కానీ ఇలా తినడం మంచిదా? కాదా? మామిడి పండును తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం పదండి.
 

Mangoes

మామిడి పండులో పోషకాలు పుష్కలం.. మామిడి పండ్లలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, పీచు పదార్థాలు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీనితో పాటుగా దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. 
 

Mangoes

మామిడిని ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య వస్తుంది.. రుచిగా ఉన్నాయని ఏది ఎక్కువగా తిన్నా.. అది మనకు హాని కలిగిస్తుంది. ఇది మామిడి పండుకు కూడా వర్తిస్తుంది. పోషకాలు పుష్కలంగా ఉండే మామిడి పండును మోతాదుకు మించి తినడం వల్ల ఒంట్లో వేడి విపరీతంగా పెరుగతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. అలాగే అజీర్థి, అసిడిటీ, గ్యాస్ మరియు చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.  కొన్ని రకాల ఆహారాలతో వీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తుతాయి.

mango

రాత్రిపూట మామిడి పండ్లను తినకూడదు..  పోషకాహార నిపుణుడి ప్రకారం.. మామిడి పండ్లు తినడం వల్ల ఎన్నో మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. కానీ తప్పుడు సమయాల్లో తింటేనే అసలుకే మోసం వస్తుంది.  మామిడి పండ్లను డిన్నర్ టైంలో తినడం వల్ల దీనిలో ఉండే ఎలాంటి పోషకాలు లభించవు. ఇలా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కాబట్టి మామిడి పండ్లను పగటిపూటనే తినండి. పొరపాటున కూడా రాత్రిపూట తినకండి.

mango

ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఖాళీ కడుపుతో మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరానికి ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. అందువల్ల ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరానికి ఎలాంటి హానిని తలపెట్టదు. 

పెరుగుతో పాటు మామిడి పండ్లను తినకూడదు.. కొంతమంది పెరుగుతో షేక్ చేయడానికి ఇష్టపడతారు. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది శరీరంలో చల్లని మరియు వేడి పరిస్థితులకు దారితీస్తుంది. ఇది చర్మ సంబంధిత వ్యాధికి కారణమవుతుంది. అలాగే శరీరంలో విషాన్ని పెంచే సమస్యకు దారితీస్తుంది. మామిడి పండ్లను స్పైసీ ఫుడ్ తో తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే మైకము లేదా వాంతి సమస్యలకు దారితీస్తుంది.

మామిడి పండ్లు తిన్న వెంటనే మీరు నీరు త్రాగకూడదు.  ఇలా చేస్తే ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యల బారిన పడతారు.  మామిడి పండ్లను తిన్న ఒక గంట తరువాత నీరు తాగాలి.

click me!