International tea day 2022: పరిగడుపున టీ తాగే అలవాటుందా?దీనివల్ల ఎన్ని రోగాలొస్తాయో తెలిస్తే టీ జోలికే వెళ్లరు

Published : May 21, 2022, 04:06 PM IST

international tea day 2022:  బ్రేక్ ఫాస్ట్ లేకున్నా సరే ఒక కప్పు టీ లేకుండా ఉండని వారికి కొదవేం లేదు. టీ ని తాగితేనే ఆరోజంగా ఉత్సాహంగా ఉంటామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజానికి టీ మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. 

PREV
112
International tea day 2022: పరిగడుపున టీ తాగే అలవాటుందా?దీనివల్ల ఎన్ని రోగాలొస్తాయో తెలిస్తే టీ జోలికే వెళ్లరు

international tea day 2022: ఉదయం, సాయంత్రం వేళల్లో పక్కాగా టీ తాగి రిలాక్స్ అయ్యే వారు చాలా మందే ఉన్నారు. మరికొంతమందైతే మూడు కాదు నాలుగు పూటలా టీని తాగేవారు కూడా ఉన్నారు. దీనిని ఎన్నో సాకులను చెబుతుంతారు. అందులోనూ భారతీయులకు టీ అంటే మహా ఇష్టం కూడా. ఇక ఈ రోజు (మే 21)  అంతర్జాతీయ టీ దినోత్సవం. ఈ సందర్భంగా మనం టీ తాగడం వల్ల కలిగే సమస్యలను తెలుసుకుందాం పదండి. 

212

ఉదయం లేవగానే ఒక గ్లాసు వేడి టీ తాగడం చాలా మందికి అలవాటు. ఒక వేల టీ తాగకపోతే ఆరోజేం బాగా గడవదని.. సత్తువ అసలే ఉండక.. నీరసంగా మారిపోతామని కొందరు భావిస్తారు. కానీ టీ తో వచ్చే ప్రాయోజనాలు సున్నా.. దీన్ని తాగడం వల్ల కలిగే అనర్థాలను చూస్తే.. మళ్లీ తాగనురా బాబోయ్ అనకుండా ఉండరు. ఇంతకు టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసుకుందాం పదండి. 

312

మెటబాలిజం:  ఉదయం పరిగడుపున టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల, క్షార పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో జీవక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. 

412

ఎసిడిక్ కంటెంట్:  టీ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. పాలు కలిపిన టీ తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.  పాలతో తయారు చేసిన టీ కడుపు ఆమ్లాన్ని పెంచుతుంది. దీంతోమీ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఇది బరువు పెరగడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి.

512

అల్సర్ సమస్య: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి టీ తాగడం వల్ల కడుపు లోపలి భాగం దెబ్బతింటుంది, ఇది కడుపులో పుండ్లు లేదా అల్సర్లకు దారితీస్తుంది.
 

612
obesity

ఊబకాయం సమస్య: ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అందులో కరిగిన చక్కెర కూడా కడుపులోకి ప్రవేశిస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క బరువులో గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది.

712

ఎముకల ఆరోగ్యం:  ఖాళీ కడుపుతో ప్రతిరోజూ కప్పుల మీద కప్పుల టీ తాగడం వల్ల అస్థి పంజర ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఇది ఎముకలను దెబ్బతీస్తుంది. దీని వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు కూడా సంభవించవచ్చు.

812

అలసట మరియు చిరాకు:  టీ తాగడం వల్ల రీఫ్రెష్ గా ఉంటారని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో పాలతో చేసిన టీ తాగడం వల్ల పనిలో అలసట మరియు చికాకు ఏర్పడుతుంది.

912

జీర్ణక్రియపై చెడు ప్రభావం:  ఇది కడుపులో గ్యాస్ సమస్యకు దారితీస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను కూడా నెమ్మదింపజేస్తుంది. అంతేకాదు పిత్త ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే వాంతులు మరియు చంచలతకు దారితీస్తుంది.
 

1012

ఒత్తిడి పెరుగుతుంది: చాలా మంది ఉదయం లేవగానే  ఫ్రెష్ గా ఫీల్ అవ్వడానికి ఖాళీ కడుపుతో టీ తాగుతారు. ఇలాంటి అలవాటున్న వారి శరీరంలో కెఫిన్ పరిమాణం విపరీతంగా పెరుగుతుంది. దీంతో వీళ్లు నిద్రలేమితో పాటుగా ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 

1112

గుండె జబ్బుల ప్రమాదం:  ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో కెఫిన్ త్వరగా శోషించుకోవడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

1212

మీరు నిజంగా ఉదయం టీ తాగాలనుకుంటే, ఇలా చేయండి.. నిద్రలేవగానే ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లను తాగండి. ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత టీ ని తాగండి. ఇకపోతే ముందు రోజు రాత్రి నాలుగు బాదం పప్పులను నానబెట్టి, ఉదయాన్నే వాటిని తొక్క తీసి తినండి. ఆ తర్వాతే టీ తాగాలి. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories