బ్రాహ్మణులు ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరో తెలుసా.. దీని వెనుక అసలైన కారణం ఇదే!

First Published May 21, 2022, 3:29 PM IST

హిందూమతంలో భాగమైన ఒక కులం బ్రాహ్మణ. ఈ కులానికి చెందిన వాళ్ళు బాగా పూజలు చేస్తూ ఉంటారు. పైగా ఎన్నో నియమ నిబంధనలతో కట్టుబడి ఉంటారు. పైగా మీరు తీసుకొనే ఆహార పదార్థాల్లో కూడా నియమ నిబంధనలు ఉంటాయి. వీళ్లు మాంసాహారాన్ని అస్సలు తినరు. వీళ్లు పూర్తి శాకాహారులు.
 

ఇక వీళ్లు శాకాహారంలో కూడా ఉల్లి, వెల్లులి అసలే తినరు. మరి ఈ రెండు పదార్థాలు తినకపోవడం కి కారణాలు ఉన్నాయా అంటే నిజంగానే ఈ రెండు పదార్థాలు తినకపోవడం కి కారణం ఉంది. మరి ఇంతకు అది ఏంటో తెలుసుకుందాం. హిందూమతంలో బ్రాహ్మణులకుఒక ప్రత్యేక గౌరవం ఉంది.
 

వీరు తమ సంస్కృతిని బోధించడంలో ప్రసిద్ధులు.ప్రతి ఒక్క విషయంలో ఆచారాలను కట్టుబడి ఉంటారు. తమ నైమిత్తిక కర్మ లతోపాటు వ్రతాలను ఆచరిస్తూ నిత్యం భగవంతుని సేవలో ఉంటారు. బ్రాహ్మణుల్లో కూడా వైష్ణవులు, శైవులు ఉంటారు. వైష్ణవులు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు. శైవులు మహా శివుని ఆరాధిస్తారు.
 

ఇక బ్రాహ్మణులు నిత్యం దైవ సేవలో ఉంటారు కాబట్టి వీరి ఎటువంటి మసాలా పదార్థాలను తినరు. మరీ ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి పదార్థాలను కూడా అస్సలు తినరు. నిజానికి వాటిని ఇంట్లోకి తీసుకొని రారు. స్మార్తులు, అయ్యర్, అయ్యంగార్ కుటుంబాలలో ఇప్పటికీ ఉల్లి, వెల్లులి వాడరు.
 

ఇక గుడిలలో సమర్పించే దేవుడి ప్రసాదం లో కూడా ఉల్లి, వెల్లుల్లి పదార్థాలను అసలే వాడరు. మరి వీటిని ఎందుకు వాడరు అంటే.. కొన్ని ఆయుర్వేద ల ప్రకారం మనం తీసుకునే ఆహారం సత్వ, రజో, తమో గుణాలని కలుగచేస్తుంది. ఇక సాత్విక పదార్థాలు తినటం వల్ల  మానసిక ప్రశాంతత కలుగుతుంది.
 

నిత్యం సత్యమైన మాటలే పలుకుతూ మనసుని అదుపులో ఉంచుకో గలుగుతాం. అందుకే బ్రాహ్మణులు ఎక్కువగా సాత్విక ఆహార పదార్థాలు తింటారు.  ఇక రజోగుణం కలుగచేసే పదార్థాలు తినడం వల్ల కోరికలు కలిగి ఐహిక సుఖాలు అనుభవించాలని కోరిక కలుగుతుంది. అందుకే ఉల్లిపాయలలో ఎక్కువగా కోరికలను కలుగ చేసే గుణాలు ఉంటాయి.
 

అందుకే పూర్వబ్రాహ్మణులు ఉల్లిపాయలను తినడాన్ని నిషేధించారు. ఇక తమోగుణం కలుగ చేసే పదార్థాలు అంటే ఉల్లి, వెల్లులి లాంటి వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల బతుకు అశాంతి, కోపం, అసూయ వంటి భావాలు కలుగుతాయి. దీనివల్ల మనసు అదుపులో కూడా ఉండదు. అందుకే నిత్యం  దైవ సన్నిధానంలో ఉండే బ్రాహ్మణులు వీటిని తినడానికి ఇష్టపడరు.
 

కానీ ఈ మధ్యకాలంలో బ్రాహ్మణులు సైతం వెల్లుల్లి, ఉల్లి కూడా తింటున్నారు. కాలం మారుతున్న కొద్దీవారి ఆహార పదార్థాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. నిజానికి వెల్లుల్లి తీసుకోవడం వల్ల కొన్ని రకాల జబ్బులు నయం అవుతాయి. ఇందులో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. చాలా మంది ఉదయాన్నే పరిగడుపున వెల్లుల్లి తీసుకుంటూ ఉంటారు. ఇంకా కొంత మంది బ్రాహ్మణులు మాత్రం ఇప్పటికీ వీటిని అస్సలు తాకరు.

click me!