హాట్ సమ్మర్ లో... కూల్ కూల్ మ్యాంగో పుదీనా లస్సీ...

First Published | Apr 16, 2021, 6:41 PM IST

వేసవికాలం అంటేనే మండే ఎండలతో పాటు మధురమైన మామిడి పండ్లు కూడా గుర్తుకువస్తాయి. మామిడి పండ్లను ఏ రకంగా తిన్నా ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మామిడి పండ్లు అప్పుడే మార్కెట్లకు పోటెత్తుతున్నాయి. అయితే ఇంకాస్త తీపి పెరగాల్సి ఉంది. 
 
కాబట్టి ఇప్పుడు దొరికే మామిడిపండ్లతో లస్సీని తయారుచేస్తే చాలా బాగుంటుంది. మండే ఎండల్లో కూల్ కూల్ గా ఉంచే.. చల్లచల్లటి పానీయం మీ జిహ్వకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

ఇంటికి వచ్చిన అతిధులకు క్షణాల్లో తయారు చేసి పెట్టొచ్చు. మామిడిపండ్ల ముక్కలు కోసి అలా ఇవ్వడంకంటే ఈ స్మూతీతో వాళ్లకూ ఓ కొత్త అనుభూతి కలుగుతుంది.
రసం మామిడిపండ్లు తినొచ్చు కదా.. అనే అనుమానం వస్తుంది. కదా అయితే దేని రుచి దానిదే. మామిడి పుడ్డింగ్, మామిడి కాయ పులిహోర, మామిడిపండ్ల రసంలాగే మామిడి పండ్లు పుదీనా లస్సీ అద్భుతంగా ఉంటుంది.. ట్రై చేయండి..

మ్యాంగో పుదీనా లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు2 మీడియం మామిడి పండ్లు2 కప్పుల ఐస్ క్యూబ్స్2 కప్పుల పెరుగు12 కప్పు చల్లని పాలు4 రెబ్బల పుదీనా ఆకులు1 టీస్పూన్ తేనె14 కప్పు నారింజ రసం12 టీస్పూన్ ఏలకులు
మ్యాంగో పుదీనా లస్సీ తయారీ చేసే విధానం..ముందుగా మామిడి పండ్లను, పుదీనా రెమ్మలను నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత మామిడి పండ్లు తొక్కతీసి.. ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఆ తరువాత ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి దీంట్లోనే పెరుగు, పాలు, ఏలకులు, నారింజ రసం, తేనె, ఐస్ క్యూబ్స్‌ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. కాస్త పులుపు ఉన్నట్టైతే దీనికి షుగర్-ఫ్రీ చక్కెర కానీ తేనె కానీ కలపండి. ఆ తరువాత చక్కటి సీసం గ్లాసులో పోసి పైన పుదీనా ఆకులతో అలంకరించి సర్వ్ చేయండి. అయితే మామిడిపండు ముక్కలు పూర్తిగా మెత్తగ అయిపోయేలా చూడాలి.
లస్సీ అంటే మజ్జిగ కర్రతో చిలకాలి. అప్పుడే దాని రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ నేటి బిజీ లైఫ్ లో అది సాధ్యమయ్యే విసయం కాదు. అంత సమయమూ కేటాయించలేరు. కాబట్టి మిక్సీలో చేసిన ఈ మాంగో పుదీనా లస్సీని ఎంజాయ్ చేయచ్చు. ఈ లస్సీ రుచి ఇంకా పెంచుకోవడానికి దీనికి కిస్ మిస్ కలిపితే ఇంకా బాగుంటుంది.

Latest Videos

click me!