కరోనా సెకండ్ వేవ్ దేశంలో తీవ్ర రూపం దాలుస్తోంది. గతంలో కరోనా వచ్చిన వారికి కూడా మరోసారి కరోనా సోకుతోంది. ప్రతిఒక్కరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా..ఇప్పటికీ చాలా మంది కరోనా లక్షణాలు ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. కేవలం జ్వరం, జలుబు వస్తేనే కరోనా లక్షణంగా భావిస్తున్నారు. దీంతో ఆలస్యంగా కరోనాని గుర్తించి చిక్కుల్లో పడుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
undefined
ఈ క్రమంలో జ్వరం, జలుబు కాకుండా ప్రాధానంగా కనిపించే కరోనా లక్షణాలు ఏంటో ఓసారి చూద్దాం..
undefined
దగ్గు.. ఇది కరోనా ప్రధాన లక్షణం. ఇది సాధారణంగా వచ్చే దగ్గు కన్నా భిన్నంగా ఉంటుంది. ఈ విషయం గమనించి.. దగ్గులో తేడా తెలియగానే.. కరోనా పరీక్ష చేయించుకోవాలి.
undefined
కళ్లు ఎర్రపడటం అనేది కరోనా మరో లక్షణం. చైనాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. కళ్లు ఎర్రపడటం.. కంటి నుంచి నీరు కారడం, కళ్లు వాయడం కూడా కరోనా లక్షణమేనని గుర్తించాలి.
undefined
ఊపిరి పీల్చుకోలేకపోవడం... కరోనా తీవ్ర లక్షణాల్లో ఇది ఒకటి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ లక్షణం కనపడితే వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి.
undefined
కడుపులో నొప్పి.. కరోనా లక్షణాల్లో ఇది కూడా ఒకటి. కరోనా సోకినవారిలో ఈ సమస్య కూడా వస్తుంది. విరోచనాలు కావడం కూడా ఒక లక్షణమని గుర్తించాలి.
undefined
మజిల్ పెయిన్స్, తొలనొప్పి, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కరోనా లక్షణాల్లో భాగమే. దాదాపు 63శాతం మందిలో ఈ లక్షణాలు ప్రధానంగా కనపడుతున్నాయని పరిశోధనలో తేలింది.
undefined
కోవిడ్ 19 శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని మనం చూశాము. కోవిడ్ నాడీ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇందులో భాగంగా, కొంతమందికి మతిమరుపు సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
undefined
'హృదయ స్పందన' అసాధారణంగా పెరగడం మరియు లయబద్ధమైన మార్పులు వంటి సమస్యలను కూడా కోవిడ్ లక్షణంగా పరిగణించవచ్చు. ప్రముఖ ఆరోగ్య ప్రచురణ 'జామా కార్డియాలజీ'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, కోవిడ్ రోగులలో 78% మందికి ఏదో ఒక రకమైన గుండె సమస్య ఉంది.
undefined
వాసన మరియు రుచి కోల్పోవడం కూడా కోవిడ్ యొక్క లక్షణాలలో ఒకటి. ప్రారంభ రోజుల్లో ఈ లక్షణం గురించి ప్రజలలో పెద్దగా అవగాహన లేకపోయినప్పటికీ ఇప్పుడు వారిలో చాలామందికి దీని గురించి తెలుసు. కోవిడ్ నయం అయినప్పటికీ, కొంతమందిలో ఈ లక్షణం చాలా కాలం పాటు కొనసాగుతుంది.
undefined