ఎండాకాలం రాగానే.. అందరూ ఇష్టంగా పుచ్చకాయ తింటాం. ఎందుకంటే.. వాటర్ మిలన్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలం దాహార్తిని తీరుస్తుంది. అంతేకాకుండా... ఎండ వేడిని తగ్గిస్తుంది. మరి వాటిలోని పుచ్చ గింజలను ఏం చేస్తున్నారు..? ఏం చేస్తారు.. బయటకు పారేస్తారు అంతేనా..?
ఆ పుచ్చకాయ గింజలను పారేయడం అంటే.. మీ ఆరోగ్యాన్ని మీరే దూరంగా విసిరేసినట్లు అని నిపుణులు అంటున్నారు. ఈ పుచ్చ గింజల వల్ల మీరు ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఊహించారా..?
పుచ్చకాయ విత్తనాలలో ఒమేగా -3 , ఒమేగా -6 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, జింక్, రాగి మరియు పొటాషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఈ పోషకాలు గుండె జబ్బులు మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పుచ్చకాయలో లభించే అనేక ఖనిజాలలో మెగ్నీషియం ఒకటి. కొన్ని పుచ్చకాయ విత్తనాలలో 21 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది
శరీరం యొక్క జీవక్రియ ప్రక్రియను నియంత్రించడానికి ,నరాలు, కండరాలు గుండె పనితీరుకు ఇవి ఎంతగానో సహాయపడతాయి.
ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి9 మెదడు పనితీరుకు ఎంతగానో సహాయం చేస్తాయి. ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే.. ప్రసవ సమయంలో శిశువులో పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తుంది. ఈ ఫోలిక్ యాసిడ్ పుచ్చగింజల్లో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం చాలా అవసరం.
పుచ్చకాయ విత్తనాలు మోనోశాచురేటెడ్ ,పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఈ కొవ్వులు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించటానికి సహాయపడతాయి.
ఎండపెట్టిన పుచ్చకాయ గింజలు.. లేదా వీటి పొడిని వివిధ రకాల ఫ్రూట్ సలాడ్స్, వివిధ సూప్స్ లో కలిపి తీసుకోవచ్చు.
అంతేకాదు.. ఈ గింజలను పొడి చేసుకొని టీలో కలుపుకోని తాగొచ్చు. లేదంటే స్మూతీస్, షేక్స్ లలో కూడా కలిపి తీసుకోవచ్చు.