Coconut Oil For Face: కొబ్బరి నూనె ముఖానికి ఇంత మంచి చేస్తుందా..!

Published : Jun 18, 2022, 04:56 PM IST

Coconut Oil For Face: ముఖానికి కొబ్బరి నూనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ఎన్నో సమస్యలు తగ్గుతాయి. 

PREV
16
Coconut Oil For Face: కొబ్బరి నూనె ముఖానికి ఇంత మంచి చేస్తుందా..!

అందమైన ముఖాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి.. కానీ చెడు జీవనశైలి కారణంగా చాలా మంది ముఖం కాంతివిహీనంగా తయారవుతుంది. అలాగే ముఖంపై ముడతలు పడటం మొదలవుతుంది. ఈ సమస్యలన్నింటినీ తీర్చడానికి కొబ్బరి నూనె ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

26

వయసు మీద పడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు పడుతుంటాయి. అయితే కొబ్బరి నూనె ముడతలను వదిలించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇదే కాకుండా కొబ్బరి నూనె మీ ముఖంలోని అన్ని రకాల సమస్యలను కూడా తొలగిస్తుంది. కొబ్బరినూనె ముఖానికి ఎలా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

36

ముఖం మెరిసిపోతుంది

కొబ్బరి నూనెలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్-ఇ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ నూనె సీరమ్ గా కూడా పనిచేస్తుంది. ఈ నూనెను ముఖానికి అప్లై చేయడం ముఖం కాంతివంతంగా తయారవుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను ముఖానికి అప్లై చేసుకోవచ్చు.

46

ముఖంపై ముడతలు పోతాయి.. 

ముఖంపై ముడతల సమస్య కూడా ఉంటే కచ్చితంగా కొబ్బరినూనెను అప్లై చేయాలి. ఈ నూనెలో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి ముఖంపై ఉండే ముడతలను పోగొడుతాయి. 

56

తేమగా ఉంచుతుంది

వాతావరణంలో మార్పు కారణంగా చాలా మంది ముఖం డ్రై గా మారుతుంది. ఇలాంటప్పుడు ముఖం పొడిబారడాన్ని తొలగించడానికి ముఖానికి కొబ్బరి నూనెను అప్లై చేసుకోవచ్చు. ఇది మీ ముఖంపై తేమను  ఉంచుతుంది.

 

66

మచ్చలు తొలగిపోతాయి

కాలుష్యం, చెడు ఆహారం తీసుకోవడం వల్ల సాధారణంగా ముఖంపై వివిధ రకాల మరకలు అవుతాయి. వీటిని వదిలించుకోవడానికి మీరు కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు అరచేతులపై కొబ్బరినూనెను తీసుకుని ముఖానికి అప్లై చేసి..  5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేసి అలాగే వదిలేయడం వల్ల మరకలు తొలగిపోతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories