Recipes: రోటీలోకి సైడ్ డిష్ గా.. మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ, అదిరిపోద్దంతే!

First Published | Oct 10, 2023, 4:31 PM IST

 Recipes: సాధారణంగా రోటీలలోకి సైడ్ డిష్ గా పొటాటో, చికెన్, దాల్ వంటివి చేస్తూ ఉంటాము. అయితే ఈసారి మలై పన్నీర్ కర్రీ సైడ్ డిష్ ట్రై చేయండి అదిరిపోద్ది అంతే. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
 

 మలై పన్నీర్ కర్రీ కి ముఖ్యంగా కావలసింది ఫ్రెష్ క్రీమ్ దీంతోపాటు ఈ డిష్ కోసం కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. 200 గ్రాముల పన్నీర్ ని అంగుళం  సైజు ముక్కలు గా కత్తిరించుకోవాలి.

ఉల్లిపాయలు మూడు, వెల్లుల్లి రెబ్బలు 10, అల్లం అంగుళం ముక్క కట్ చేసుకున్నది. అర టీ స్పూన్ పసుపుపొడి, రెండు పచ్చిమిర్చి,  బ్లాక్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, బాదం 4.
 


జీడిపప్పు 4, ఒకటిన్నర కప్పు ఫ్రెష్ క్రీమ్  ఇక చివరిగా రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రాత్రంతా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు, బాదంపప్పులని గ్రైండర్లో వేసి మెత్తని పేస్ట్ గా చేసి పక్కన పెట్టుకోండి.
 

 కసూరి మేతి ఆకులు ఒక టేబుల్ స్పూన్, క్రీమ్ అరకప్పు, చక్కెర ఒక స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నూనె రుచికి తగినంత. ఇప్పుడు తయారు చేసే విధానం ఎలాగో చూద్దాం ముందుగా నాన్ స్టిక్ పాన్ లో కొంచెం నూనె వేసి పన్నీర్ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
 

ఆపై కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి మరియు ఉప్పు వేసి బాగా కలపండి. ఆపై డ్రై ఫ్రూట్ పేస్ట్ వేసి బాగా కలపండి. ఆపై అరకప్పు నీరు వేసి మిశ్రమాన్ని మరిగించండి. మిశ్రమం ఉడకడం ప్రారంభించినప్పుడు మంట తగ్గించి పన్నీర్ ముక్కలు, గరం మసాలా పొడి మరియు ఎండిన మెంతి ఆకులు జోడించండి.
 

ఆపై నాలుగైదు నిమిషాల తర్వాత గ్రేవీ బాగా దగ్గర పడుతుందనుకున్న సమయంలో అందులో ఫ్రెష్ క్రీమ్ వేయండి. క్రీమ్ వేసిన తర్వాత గ్రేవీని స్టవ్ పై ఎక్కువసేపు ఉంచకండి. ఐదు నిమిషాల లోపుగా కూరని కిందకు దించి వేరే బౌల్లో సిద్ధం చేసుకుని కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేస్తే మస్తు మస్తు మలై పన్నీర్ కర్రీ  రెడీ.

Latest Videos

click me!