Health Tips: నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే మఖానా ఆహారంగా తీసుకోవాల్సిందే!

First Published | Oct 10, 2023, 4:21 PM IST

Health Tips: మఖాన లేదా తామర గింజలు అనేవి ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకున్న ఒక ఆర్గానిక్ ఫుడ్. దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. అవేమిటో చూద్దాం.
 

 సాధారణంగా మనం ఆరోగ్యం కోసం డ్రై ఫ్రూట్స్ అయిన జీడిపప్పు, బాదంపప్పు తింటూ ఉంటాము. అయితే మఖానా లో ఇంతకన్నా ఎక్కువగా పోషక విలువలు ఉంటాయి. అలాగే ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. మఖానాలో సమతుల్య మొత్తంలో కార్బోహైడ్రేట్లు మరియు ఐరన్ ఉంటాయి. అవి దీనిని సూపర్ ఫుడ్ గా మారుస్తుంది. మఖానా యొక్క పోషక  విలువలు ఆహారాన్ని ఆరోగ్యకరంగా చేస్తుంది.
 

మఖానాని ఆహారంగా తీసుకోవటం వలన కలిగే లాభాలు ఏమిటో చూద్దాం. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వలన ఆరోగ్యకరంగా బరువుని తగ్గించుకోవచ్చు. అలాగే ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. మఖానలోని ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడతాయి.
 


 అలాగే క్యాలరీల విలువ మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన మఖాన మధుమేహం మరియు శరీరంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే వీటిని వృద్ధాప్య వ్యతిరేక ఆహారంగా ఉపయోగించవచ్చు.
 

 అలాగే నిద్రలేమిటో బాధపడేవారు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేవారు  రాత్రిపూట కొంచెం మఖాన ఆహారంగా తీసుకొని గ్లాసు పాలు తాగటం వలన ఒత్తిడి తగ్గి మంచి నిద్ర పడుతుంది. మఖాన వంధ్యత్వ సమస్యలతో బాధపడే పురుషులు అలాగే మహిళలు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.
 

 దీనిని ఆహారంగా తినటం వలన వీర్యం నాణ్యతను మెరుగుపరచడం మరియు అకాల స్కలనాన్ని నివారించడం జరుగుతుంది. అలాగే మఖానా యొక్క పోషక ప్రయోజనాలు కాలేయ పనితీరుని నిర్వహించడానికి మరియు జీవక్రియను మెరుగుపరచడానికి కూడా దోహదం చేస్తాయి.
 

 మఖానలో అధిక మెగ్నీషియం కంటెంట్ మరియు తక్కువ కొవ్వు మరియు సోడియం స్థాయిలు రక్తపోటు స్థాయిలోనే నిర్వహించడంలో ప్రభావంతంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తపోటు ఉన్న వ్యక్తులు దీనిని ఆహారంగా తీసుకోవడం వలన ఎల్లవేళలా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

Latest Videos

click me!