Health Tips: నాన్ వెజ్ మానేస్తే ఆరోగ్యం బాగుపడుతుందా.. డాక్టర్లు ఏమంటున్నారు!

First Published | Oct 10, 2023, 1:20 PM IST

Health Tips: ఈ రోజుల్లో చాలామంది నాన్ వెజ్ తినటానికి ఇష్టపడుతున్నారు. అయితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని, శాఖాహారం ఆరోగ్యానికి చాలా మంచిదని కొందరు అంటున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

 ఈరోజుల్లో పిల్లలతో పాటు పెద్దలు కూడా నాన్ వెజ్ ని వివిధ రూపాలలో బాగా లాగించేస్తున్నారు. నిజానికి నాన్ వెజ్ భోజనంలో లేకపోతే భోజనం తినటానికి కూడా ఇష్టపడటం లేదు చాలామంది. అయితే మాంసాహారం ఆరోగ్యానికి మంచిది కాదు దానిని మానేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది.

శాఖాహారమే ఒంటికి చాలా మంచిది అని కొంతమంది గట్టిగా వాదిస్తున్నారు. అయితే అందులో నిజం ఎంత ఇప్పుడు చూద్దాం. నిజానికి నాన్ వెజ్ తినే వాళ్ళ కంటే శాఖాహారులే ఆరోగ్యంగా ఉంటున్నారని వైద్యులు అంటున్నారు. శాఖాహారులు అంటే మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు ఇలా అన్నిటికీ దూరంగా ఉన్నవారే స్వచ్ఛమైన శాఖాహారులు.
 

Latest Videos


 స్వచ్ఛమైన శాఖాహారం ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని అధ్యయనాలు ప్రకారం గుండె వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అలాగే శాఖాహారంలో ఆరోగ్యకరమైన అవసరమైన కొవ్వు మాత్రమే ఉంటుంది. దీనివలన గుండె వంటి ప్రధాన అవయవాలు వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి.
 

 తద్వారా జీవన కాలం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే శాకాహారులు అన్ని రకాల కాయగూరలని తింటేనే పైన చెప్పిన ఉపయోగాలు అన్ని ఉంటాయి. లేని పక్షంలో విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియం, మెగ్నీషియం, ఫైటో కెమికల్ వంటి పోషకాలు శరీరానికి అందకుండా పోతాయి.
 

 తద్వారా పోషకాహార లోపం ఏర్పడుతుంది. పైన చెప్పిన  పోషకాలన్నీ నాన్ వెజ్ లో ఉంటాయి. అయితే ఇక్కడ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే శరీరానికి అవసరమైన, ఆరోగ్యకరమైన ఆహారం వెజిటబుల్స్ లోని అలాగే నాన్ వెజ్ లోని కూడా ఉంటుంది. అయితే నాన్ వెజ్ అతిగా తింటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం. అందులో పోషకాలు మన శరీరానికి అందే అంతవరకు తీసుకుంటే చాలు.
 

అదే వెజిటబుల్స్ లో అయితే మనం లిమిట్ లేకుండా ఆహారాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఏమి తింటే మన శరీరానికి ఆరోగ్యం చేకూరుతుందో చూసుకొని ఎంపిక చేసుకోమంటున్నారు వైద్యులు. అంతేగాని పూర్తిగా నాన్ వెజ్ మానేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది అని ఏ వైద్యులు పక్కాగా చెప్పటం లేదు.

click me!