Chanakya Niti: ప్రతి భర్త.. తమ భార్యను ఈ నలుగురికి దూరంగా ఉంచాలి, ఎందుకో తెలుసా?

Published : Jul 07, 2026, 02:27 PM IST

 Chanakya Niti: కొందరితో స్నేహం చేయడం వల్ల స్త్రీల మనసు, మెదడు పాడైపోతాయని మీకు తెలుసా? దాని వల్ల కుటుంబంలో వివాదాలు, సమస్యలు వచ్చేస్తాయి. అందుకే.. ప్రతి భర్త తమ భార్యను కొందరికి దూరంగా ఉంచాలని చాణక్యుడు చెబుతున్నాడు.

PREV
13
చాణక్యుడు ఏమంటున్నాడంటే...

భార్యాభర్తల మధ్య గొడవలు, వాదనలు జరగడం చాలా సహజం. అయితే.. భార్య ప్రతి రోజూ అది కావాలి ఇది కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరుతోందని.. దాని కారణంగా.. ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయని చాలా మంది పురుషులు వాపోతూ ఉంటారు. అందుకే.. ఏ పనీ లేకపోయినా ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ ఉంటారు. అయితే.. ఇంటిని వదిలేసి బయట తిరగాల్సిన అవసరం లేదు.. కేవలం మీ భార్యలను కొందరితో స్నేహం చేయకుండా ఆపితే చాలు అని చాణక్యుడు చెబుతున్నాడు. స్త్రీల మనసు చాలా తొందరగా మారుతుంది. అందరూ కాదు కానీ చాలా వరకు ఇతరుల మాటలకు ఎక్కువగా ప్రభావితులు అవుతూ ఉంటారు. దీని వల్లే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. స్త్రీలు ఎవరికి దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం...

23
శీలం లేని స్త్రీలు..

చాణక్యుని ప్రకారం, చెడు అలవాట్లు ఉన్న స్త్రీలకు మీ భార్యను దూరంగా ఉంచాలి. ముఖ్యంగా శీలం లేని వారికి మరింత దూరంగా ఉంచాలి.ఎందుకంటే, అలాంటి స్త్రీలు కుటుంబ సంబంధాలను, ఇతరుల గౌరవాన్ని పెద్దగా పట్టించుకోరు. అలాంటివారితో స్నేహం మీ కుటుంబానికి సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అందుకే.. అలాంటి వారికి మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ భార్యను దూరంగా ఉంచాలి.

డబ్బు ఉందనే అహం చూపించే వారు..

చాలా మంది స్త్రీలకు డబ్బు ఉందనే అహం చాలా ఎక్కువగా ఉంటుంది. అహం ఉండటమే కాదు.. ప్రతిసారీ.. ఆ డబ్బును అందరి ముందు ప్రదర్శించాలని అనుకుంటారు. తమ దగ్గర కావాల్సినంత డబ్బు ఉందని.. ఇతరులకు అది లేదని ప్రతిసారీ గుర్తు చేస్తూ బాధ పెడుతూ ఉంటారు. అలాంటివారితో మీ భార్య కూడా స్నేహం చేస్తే ఆలోచనలు మారిపోతాయి. అసమంజసమైన కోరికలు కూడా పెరుగుతాయి. అది మీ జీవితానికి సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. అందుకే.. అలాంటి వ్యక్తులను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.

33
కోపంగా ఉండే స్త్రీలు..

చాలా మంది స్త్రీలకు చిన్న విషయానికే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వారితో గొడవలు పడుతూ ఉంటారు. ఇలాంటి వారితో కూడా స్నేహం చేయకూడదు. వీరికి కూడా వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే.. వారితో ఎక్కువగా స్నేహం చేస్తే.. ఆ ప్రభావం మీ భార్యపై కూడా పడే అవకాశం ఉంది. దీని వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు దూరమౌతాయి.

అసూయతో రగిలిపోయేవారు..

ఇతరులు సంతోషంగా ఉన్నా, జీవితంలో కాస్త ఎదిగినా కొందరు ఓర్వలేరు.వెంటనే అసూయ చూపిస్తారు. పైకి మాత్రం.. నవ్వుతూ మాట్లాడుతూ..వెనక మాత్రం గోతులు తవ్వేస్తారు. అలాంటి అసూయతో ఉన్న మహిళలకు కూడా మీ భార్య వీలైనంత దూరంగా ఉండటం మంచిది. అటువంటి వారితో స్నేహం చేయడం వల్ల.. మీ వ్యక్తిగత విషయాలు వారికి తెలిసిపోతాయి. దీని వల్ల.. మీ ఎదుగుదల చూసి వారు తట్టుకోలేరు. చివరకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ఇలాంటి వారికి దూరంగా ఉంటే.. మీ ఇంటి విషయాలు వారికి చేరవు.

చాణక్యుడు చెప్పిన ఈ నియమం ఫాలో అయితే.. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి కారణంగా సమస్యలు ఎప్పటికీ రావు. సంతోషంగా ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories