Hair Color: తెల్ల జుట్టును దాచేయడానికి ఎంతోమంది కెమికల్స్ కలిపిన రంగులను వాడతారు. ఇంట్లోనే నల్ల నువ్వులతో జుట్టు రంగును తయారు చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రాకుండా ఉంటాయి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు.
తలలో తల్ల వెంట్రుకలు రావడం మొదలయితే చాలు ఎంతోమంది బయటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతూ ఉంటారు. యువతలో తెల్ల జుట్టు సమస్య అధికంగా కనిపిస్తోంది. కొన్ని వెంట్రుకలు తెలుపు, కొన్ని వెంట్రుకలు నలుపు ఉంటే సాల్ట్ అంటే పెప్పర్ లుక్ వస్తుంది. ఈ లుక్ అందరికీ నచ్చకపోవచ్చు. అలా నచ్చని వారు జుట్టుకు రంగు వేస్తారు. బయట దొరికే రంగులన్నీ కూడా రసాయనాలు కలిసినవే. వీటిని పదే పదే వాడితే జుట్టు దెబ్బ తినడం ఖాయం. అలాగే మన వెంట్రుకలకు ఉన్న సహజ రంగు కూడా పోతుంది. కాబట్టి ఇంట్లోనే నల్ల నువ్వులతో జుట్టు రంగును తయారు చేయవచ్చు.
23
నల్ల నువ్వులతో రంగు తయారీ
నల్లటి జుట్టు రంగును తయారు చేసేందుకు రెండు టీ స్పూన్ల నల్ల నువ్వులను తీసుకోండి. అలాగే నువ్వుల నూనె, మట్టి దీపం, దూది, కొబ్బరి నూనె కూడా సిద్ధం చేసుకోండి. దూది తీసుకొని అందులో నల్ల నువ్వులను నింపి దీపపు ఒత్తుల్లాగా చుట్టండి. వాటిని ఒక మట్టి ప్రమిదలో ఉంచండి. ఆ మట్టి ప్రమిదలో ఇప్పుడు ఆ వత్తిని వెలిగించండి. మట్టి దీపం కవర్ చేసేందుకు ఒక పెద్ద గిన్నెను బోర్లించండి. మంట నుండి వచ్చే పొగ ఆ గిన్నెకు తగులుతుంది. అక్కడ నల్లటి బూడిద పేరుకుపోతుంది. దీపాలు ఆరిపోయిన తర్వాత మసిని సేకరించి ఒక చిన్న ప్లేట్ లో వేయండి. ఇప్పుడు ఆ మసిలో కొబ్బరి నూనె కలిపి పేస్టులా చేసుకుని తెల్లటి జుట్టుకు అప్లై చేయండి. అంతే తయారైపోయినట్టే.
33
జుట్టు నల్లగా
నల్ల నువ్వులతో చేసిన ఈ రంగు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావు. పైగా ఖర్చు కూడా తక్కువగానే అవుతుంది. ఇది సహజమైన జుట్టు రంగుగా భావించాలి. ఈ జుట్టు రంగును వారానికి రెండు నుండి మూడుసార్లు వెంట్రుకలకు అప్లై చేయండి. కొంతకాలం తర్వాత మీ జుట్టు సహజంగానే నల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతమంది తెల్ల నువ్వులతో ఇలా చేసేందుకు ప్రయత్నిస్తారు. నల్ల నువ్వులతో చేస్తేనే ఇది సరిగా వస్తుంది. నల్ల నువ్వులు జుట్టును నల్లగా, బలంగా మార్చడానికి కూడా సహాయపడతాయి. ఈ నల్ల నువ్వుల్లో మనకు అవసరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అవి జుట్టు ఎదుగుదలకు కూడా పడతాయి. ఆయుర్వేదంలో కూడా నల్ల నువ్వులకు ఎంతో ప్రాధాన్యత ఉంది.