Makar Sankranti 2024: జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక రాశి నుంచి బయటకు వచ్చి మరో రాశిలోకి ప్రవేశించిన సంఘటనను సంక్రాంతి అంటారు. 12 రాశులు ఉండటం వల్ల సంవత్సరానికి మొత్తం 12 సంక్రాంతులు వస్తాయి. సూర్యభగవానుడు ధనుస్సు రాశిని వదిలి మకర రాశిలో ప్రవేశించినప్పుడు దానిని మకర సంక్రాంతి అంటారు. అన్ని సంక్రాంతులలో మకర సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది.
మకర సంక్రాంతి శుభ ముహూర్తం
2024 సంవత్సరంలో మకర సంక్రాంతిని జనవరి 15 సోమవారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుంచి తెల్లవారుజామున 02.54 గంటలకు బయలుదేరి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి నాడు మహా పుణ్యకాల్లో స్నానం చేయడం, దానాలు చేయడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మరి మకర సంక్రాంతి శుభ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మకర సంక్రాంతి పుణ్యకాలం - 07:15 నిమిషాల నుంచి 06:21 నిమిషాల వరకు
మకర సంక్రాంతి మహా పుణ్యకాలం - ఉదయం 07:15 నుంచి 09:06 వరకు
రవి యోగం - ఉదయం 07:15 నుంచి 08:07 వరకు
మకర సంక్రాంతి నాడు సూర్యారాధన ప్రాముఖ్యత
మకర సంక్రాంతిని హిందూ మతంలో మహాపర్వం అని కూడా అంటారు. ఈ ప్రత్యేకమైన రోజున సూర్యభగవానుడు ఉత్తరాయణుడు అవుతాడు. ఈ రోజు సూర్యభగవానుడు ధనుస్సు రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశించే ఈ ప్రక్రియను సూర్యభగవానుని పరివర్తన కాలం అంటారు. ఈ ప్రత్యేక సందర్భంలో సూర్యభగవానుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అలాగే మకర సంక్రాంతి నాడు తినే కిచిడీ ఆరోగ్య పరంగానే కాకుండా అనేక మతపరమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుందని చెప్తారు.
జ్యోతిష విశ్వాసం ప్రకారం..
కిచిడీలో వాడే అన్నం చంద్రుడికి చిహ్నమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే కిచిడీలో ఉపయోగించే నల్ల మినప్పు శనికి, పసుపు బృహస్పతికి, ఉప్పు శుక్రుడికి చిహ్నం. అలాగే కిచిడీలో ఉపయోగించే ఆకుపచ్చ కూరగాయలు బుధ గ్రహానికి సంబంధించినవని నమ్ముతారు. కాగా మకర సంక్రాంతి నాడు కిచిడీని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీనితో పాటుగా జాతకంలో అశుభ గ్రహాల ప్రభావం కూడా తగ్గుతుంది. అలాగే శనిదేవుని అనుగ్రహం మనపై ఉంటుంది. శని దోషంతో బాధపడేవారు మకర సంక్రాంతి నాడు కిచిడీని తింటే దోషం పూర్తిగా పోతుందని నమ్మకం ఉంది.
అందుకే కిచిడీ తింటారు
మకర సంక్రాంతి పండుగకు ముందు సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వరి కోతకు వస్తుంది. ఇలాంటి సందర్భంలో మకర సంక్రాంతి నాడు.. కొత్త బియ్యంతో చేసిన కిచిడీని దేవుడికి సమర్పించి, దానిని ప్రసాదంగా తీసుకుంటారు. అలాగే ఈ కిచిడీ భోగాన్ని సూర్యభగవానుడికి కూడా సమర్పిస్తారు. తర్వాత దీనిని ప్రసాదంగా తింటారు. అలా చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు.