మకర సంక్రాంతి పండుగను ప్రతి ఏడాది మనం మకర రాశిలో సూర్యుడు సంచరించే రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 15న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే 2024లో మకర సంక్రాంతిని జనవరి 15న జరుపుకోబోతున్నాం. ఈ రోజున గంగానదిలో స్నానమాచరించి దేవుడిని పూజించడం, జపం చేయడం, దానం చేయాలనే నియమం ఉంది. మకర సంక్రాంతి నాడు సూర్యభగవానుడు ఉత్తరాయణుడవుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. మకర సంక్రాంతి నాడు శివుడిని పూజిస్తే పితృ దోషం తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అలాగే ఈ రోజు పూజ చేయడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. మీరు కూడా పితృ దోషం నుంచి విముక్తి పొందాలనుకుంటే మకర సంక్రాంతి నాడు తలస్నానం చేసి ధ్యానం చేయండి. ఆ తర్వాత శివుడికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది. ఇంతకీ శివుడికి ఎలా అభిషేకం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అభిషేక సమయం
మకర సంక్రాంతి నాడు అరుదైన శివ వాసి యోగం ఏర్పడనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజున పరమేశ్వరుడు మధ్యాహ్నం 02.16 గంటల వరకు కైలాస దీక్షలో కూర్చుంటారు. శివుడు కైలాసంపై కూర్చున్నప్పుడు అభిషేకం చేయడం చేస్తే మీరు అన్ని రకాల సుఖసంతోషాలు పొందుతాడని శివ పురాణంలో చెప్పబడింది. అదే సమయంలో బాధలన్నీ తొలగిపోతాయి. అందుకే ఈ సమయం వరకు మీరు శివుడికి అభిషేకం చేయొచ్చు.
అభిషేకం ఎలా చేయాలి?
మీరు మీ జీవితంలో దుఃఖం, బాధల నుంచి నుండి విముక్తి పొందాలనుకుంటే మకర సంక్రాంతి నాడు గంగా నీరు కలిపిన నీటితో స్నానం చేయండి. అందుబాటులో ఉంటే గంగా, గోదావరి, నర్మదా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయండి. ఆ తర్వాత తెల్లని దుస్తులు ధరించి ఆవు పాలతో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యితో శివుడికి అభిషేకం చేయండి. ఈ సమయంలో నల్ల నువ్వులు, పువ్వులు, బెల్విపత్రం వంటి వస్తువులను శివుడికి సమర్పించండి. పూజ సమయంలో శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి.