మగాళ్లకు పొట్ట ఎందుకొస్తుంది? దీన్ని ఎట్ల తగ్గించుకోవాలి?

First Published | Jan 10, 2024, 10:44 AM IST

మగవారికి వచ్చే కామన్ సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ ఒకటి. పొట్ట పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంటే ఆహారపు అలవాట్ల నుంచి లైఫ్ స్టైల్ వరకు.. ప్రతి ఒక్కటీ పొట్ట పెరిగేందుకు కారణమవుతుంది. మరి మగాళ్లు ఈ పొట్టను ఎలా కరిగించుకోవచ్చంటే? 

belly fat loss

వయసు పెరిగే కొద్దీ పొట్ట పెరగడం చాలా కామన్. కానీ పొట్ట పెరిగితే లేనిపోని రోగాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు గమనించారో లేదో? పెళ్లైన తర్వాత బెల్లీ ఫ్యాట్ పెరిగే సమస్య మగవారిలో కామన్ అయిపోయింది. కానీ చాలా మంది ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల పొట్ట సైజు రోజు రోజుకు పెరిగిపోతుంది. పొట్ట పెరగడం ఎంత ఈజీనో.. దాన్ని తగ్గించుకోవడం అంత కష్టం. అవును దీనికోసం ఎంతో కష్టపడాలి. నడుము సైజు తగ్గడానికి నెలల సమయం పట్టొచ్చు లేదా సంవత్సరాల సమయం పట్టొచ్చు. అనారోగ్యకరమైన ఆహారం, కూర్చునే అలవాట్లు, బలహీనమైన జీర్ణవ్యవస్థ, ఇతర కారణాల వల్ల  పురుషుల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో పురుషులు తమ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

belly fat loss

రెగ్యులర్ వ్యాయామాలు

రెగ్యులర్  గా వ్యాయామం చేసే అలవాటును మీరు అలవర్చుకోవాలి. ఇది మిమ్మల్ని ఫిట్ గా ఉంచడంతో పాటుగా పొట్టను, శరీర బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. యోగా, వ్యాయామం, కార్డియో వ్యాయామాలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
 

Latest Videos


belly fat

సరైన ఆహారం

సరైన ఆహారాన్ని తీసుకుంటూ కూడా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ రోజువారి ఆహారంలో పాత నూనెలకు బదులుగా ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, తాజా,ఆరోగ్యకరమైన నూనెలను జోడించాలి. ఇవి మీ పొట్ట పెరగకుండా సహాయపడతాయి. 

belly fat

వాటర్ తాగడం

నీళ్లు కూడా మీరు బరువు పెరగకుండా తగ్గడానికి సహాయపడతాయి. నీళ్లను తాగితే చాలా వరకు ఆకలి కంట్రోల్ అవుతుంది. దీంతో మీరు అతిగా తినరు. అందుకే ప్రతి రోజూ నీటిని పుష్కలంగా తాగండి. నీళ్లు జీవక్రియను ప్రోత్సహించడానికి కూడా సహాయపడుతాయి. ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

వెల్లుల్లి, అల్లం

అల్లం, వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే వీటిని దగ్గు, జలుబు వంటి ఎన్నో చిన్న చిన్న సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే ఇవి కూడా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే మీరు వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. 
 

సరైన భంగిమ

సరైన భంగిమ కూడా మీ పొట్టను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. నిటారుగా కూర్చోవడం, నిటారుగా నిలబడటం, సరైన శరీర భంగిమను నిర్వహించడం వల్ల ఉదర కండరాలు సరైన స్థితిలో ఉంటాయి. దీనివల్ల నడుము నొప్పి రాకుండా ఉండటమే కాకుండా.. మీ పొట్ట పెరిగే అవకాశం కూడా ఉండదు. 

belly fat

తగినంత నిద్ర

నిద్రతోనే ఎన్నో రోగాలు సగం తగ్గిపోతాయి తెలుసా? కంటినిండా నిద్రపోయే వారు ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. మంచి గాఢ నిద్ర బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందుకే మీరు క్రమం తప్పకుండా మెరుగైన నిద్రపోయేలా చూసుకోవాలి. 

belly fat

ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడి లేని లైఫ్ ఈ కాలంలో వెతికినా దొరకదేమో. కానీ ఇది మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అవును ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, మీరు మీ దినచర్యలో యోగా, ధ్యానాన్ని చేర్చండి. ఒత్తిడి తగ్గితేనే మీరు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారు.

నిపుణుల సలహా

మీకు కడుపునకు సంబంధించిన సమస్య ఉంటే నిపుణుల సలహా తీసుకోవచ్చు. డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సూచనల ద్వారా మీరు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సరైన ప్రణాళికను రూపొందించొచ్చు. బొడ్డు కొవ్వును తగ్గించడం సమయం తీసుకునే ప్రక్రియ అని గుర్తుంచుకోండి. దీనికి సహనం చాలా అవసరం. ఒక్కరోజులో పొట్ట కరగడం సులువు కాదు. 

click me!