Makar Sankranti 2024: మకర సంక్రాంతి పండుగను ఉత్తరాయణం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15న జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం మకర సంక్రాంతి పండుగ జనవరి 15 న వస్తుంది. ఈ శుభ సమయం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. పురాతన సంప్రదాయాల ప్రకారం.. మకర సంక్రాంతి కొత్త ప్రారంభాలు, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు.
ఈ పండుగ మూలాలు సూర్యభగవానుని ఆరాధన, చలికాలం ముగింపును సూచిస్తుంది. ఈ రోజున సూర్యుడు తన కుమారుడు శనీశ్వరుడిని సందర్శిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. రైతులకు.. మకర సంక్రాంతి పంట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. అందుకే ఈ పండును గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి భారతదేశమంతటా మకర సంక్రాంతి పండుగను వివిధ పద్దతుల్లో జరుపుకుంటారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర ప్రదేశ్
ఉత్తర ప్రదేశ్ లో మకర సంక్రాంతి నాడు 'కిచిడీ' అని పిలువబడే బియ్యం, కాయధాన్యాలతో ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేస్తారు. ఇక్కడ మకర సంక్రాంతి నాడు ఇక్కడి ప్రజలు గంగానదిలో పవిత్ర స్నానాలు చేస్తారు. ప్రతి 12 సంవత్సరాలకోసారి కుంభమేళాను ప్రారంభిస్తారు.
గుజరాత్
సంక్రాంతి పండుగను 'ఉత్తరాయణం' అని కూడా అంటారు. ఇక్కడి ప్రజలు గాలిపటాలను ఎగురవేసే పోటీలను ఎక్కువగా నిర్వహిస్తారు. ఇక్కడి ఆకాశం గాలిపటాలతో నిండిపోతుందంటే నమ్మండి. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను కూడా నిర్వహిస్తారు. దీన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా వస్తారు.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో కూడా సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి పండుగకు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగే నువ్వుల లడ్డులను కూడా ఇక్కడ ఎక్కువగా చేసి తింటారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు గాలి పటాలను ఎగిరేస్తూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.
తమిళనాడు
'పొంగల్' తమిళ మాసం థాయ్ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగను రంగురంగుల రంగోలీలు, తీపి వంటకాలు, బియ్యం పిండి వంటకాలతో జరుపుకుంటారు.
పంజాబ్
సంక్రాంతి ఉత్సవాలలో భోగి మంటలు, సాంప్రదాయ నృత్యాలు మనల్ని కట్టిపడేస్తాయి. ఇక్కడి ప్రజలు ఈ పండుగక ఫలవంతమైన పంట కోసం ప్రార్థనలు చేస్తారు.