భోగి పండుగ నాడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

First Published | Jan 13, 2024, 9:53 AM IST

Bhogi 2024: మకర సంక్రాంతికి ఒక రోజు ముందు భోగీ పండుగను జరుపుకుంటారు. కొత్త పంటలు పండిన ఆనందంలో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు అందరూ ఒక చోట చేరి భోగి మంటలను వెళిగిస్తారు. అయితే భోగీపండుగ నాడు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. 
 

ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి ఒక రోజు ముందు భోగీ పండుగను జరుపుకుంటారు. ఈ శుభ సందర్భంలో చాలా మంది ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ భోగీ పండుగ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటారు.ఈ ఈ పండుగను కొత్త పంట పండిన ఆనందంలో జరుపుకుంటారు. సూర్యుడు జనవరి 15 న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. 2024 లో భోగీ పండుగ జనవరి 13 న కాకుండా జనవరి 14న ఉంటుంది. ఆ రోజు అందరూ ఒకే చోటికి చేరి భోగి మంటలను వెలిగిస్తారు. అయితే ఈ రోజు కొన్ని పనులు చేయడం పూర్తిగా నిషేధించబడింది. అలా చేయడం ద్వారా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి భోగిపండుగ నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

భోగినాడు ఏం చేయాలి?

సందర్భంగా పేద బాలికలకు అన్నం పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆహారానికి కొదవ ఉండదని నమ్ముతారు.

సనాతన ధర్మంలో అగ్ని శుభానికి, పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. కాగా భోగీ నాడు అగ్నిదేవుడిని తప్పకుండా పూజించండి. ఇలా చేయడం వల్ల మీరు శుభ ఫలితాలను పొందుతారు.
 


ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే గోధుమలను ఎర్రటి వస్త్రంలో కట్టి అవసరమైన వారికి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుందని నమ్ముతారు. 
 

bhogi festival

భోగి నాడు ఏం చేయకూడదు?

భోగి పండుగ నాడు తామాసిక ఆహారాన్ని తీసుకోకూడదు. అంటే మాంసం, వెల్లుల్లి, ఉల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
అంతేకాదు ఈ రోజున మీరు ఎవరినీ అవమానించకూడదు.
భోగి పండుగ నాడు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు.
భోగిమంటల్లో ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను వేయడం మానుకోవాలి. 

Latest Videos

click me!