రోజూ గంట సేపు నడిస్తే ఎంత బరువు తగ్గుతారో తెలుసా?

First Published Sep 24, 2024, 12:15 PM IST

వాకింగ్ మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇది శరీరంలో కేలరీల సంఖ్యను తగ్గిస్తుంది. మీరు ఫిట్ గా, హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాదు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మీరు రోజూ ఒక గంట సేపు నడిస్తే ఎంత బరువు తగ్గుతారో తెలుసా? 
 

బరువు తగ్గడానికి పెద్దగా కష్టపడకుండా, ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా ఉండే చిట్కాల్లో వాకింగ్ ఒకటి. అవును వాకింగ్ మీ బరువును తగ్గించడమే కాదు ఎన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అందుకే ఖచ్చితంగా ఉదాయన్నే లేదా సాయంత్రం పూట ఖచ్చితంగా వాకింగ్ చేయాలని డాక్టర్లు చెప్తుంటారు. 

వేరే ఎక్సర్ సైజ్లు మాదిరిగానే వాకింగ్ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుందని చాలా మంది నమ్మరు. కానీ నడిస్తే మీరు చాలా బరువు తగ్గుతారు. అసలు రోజూ ఒక గంట పాటు వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

Latest Videos


కేలరీలు కరుగుతాయి

వాకింగ్ మీ శరీరంలోని కేలరీలను కరిగించడానికి బాగా సహాయపడుతుంది. అయితే మీరు నడుస్తున్నప్పుడు మీ శరీరం ఎన్ని కేలరీలను బర్న్ చేస్తుందనే సంఖ్య ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ముఖ్యంగా మీ శరీర బరువు, నడిచే వేగం దీనిలో కీలక పాత్ర పోషిస్తాయి. 18 ఏండ్లు పైబడిన వారు గంటకు 4.8 కిలోమీటర్ల వేగంతో నడవగలుగుతారు. అయితే మీరు ఎంత ఫాస్ట్ గా నడిస్తే మీ శరీరం అంత ఎక్కువ కేలరీలను కరిగించగలుగుతుంది.

ఉదాహరణకు 82 నుంచి 85 కిలోల బరువున్న వారు రోజూ గంటకు 4.8 కిలోమీటర్ల వేగంతో నడిస్తే 270 కేలరీలను కరిగించగలుగుతారు. అదే 95 నుంచి 97 కిలోల బరువున్న వారు 314 కేలరీలను కరిగించగలుగుతారు. అయితే మీ వయసు, లింగం, నడిచే ప్లేస్, ఉష్ణోగ్రతలు కూడా కేలరీల సంఖ్యతో సంబంధం కలిగి ఉంటాయి.
 

గంట సేపు నడిస్తే..

వారానికి కనీసం 300 నిమిషాలతో నడకను ప్రారంభించి..రోజూ ఒక గంట పాటు 420 నిమిషాల పాటు నడిస్తే మీరు బోలెడు లాభాలను పొందుతారు. ఇది మీ శరీర బరువును చాలా వరకు తగ్గిస్తుంది. వాకింగ్ మీ కండరాల బలాన్ని ఏమాత్రం తగ్గించదు. అలాగే వెయిట్ లాస్ జర్నీలో మీ ఆరోగ్యం దెబ్బతినకుండా పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. 

ఆహారంలో కేలరీల కంటెంట్

ప్రతిరోజూ వాకింగ్ కు వెళ్లినా..కొంచెం కూడా బరువు తగ్గలేదు అనిపిస్తే మాత్రం.. మీరు తినే ఆహారంపై ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే మీరు తినే ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉంటే మీరు బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నం చేసినా వేస్టే అవుతుంది. ఒక కిలో బరువులో 7,700 కేలరీలు ఉంటాయి. 

కాబట్టి మీరు 82 నుంచి 85 కిలోల బరువు ఉంటే.. రోజూ వ్యాయామం చేస్తున్నట్టైతే దాదాపుగా 2200 కేలరీలు మాత్రమే తీసుకుంటే.. మీరు 2 కిలోల వరకు బరువు తగ్గుతారు. బరువు తగ్గాలంటే కేలరీలను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. నిపుణుల ప్రకారం.. పురుషులు రోజుకు 2,200 కేలరీలు తీసుకుంటే ఆడవారు రోజుకు 2,000 కేలరీలను తీసుకోవాల్సి ఉంటుంది. 

click me!