Diabetes: షుగర్ పేషెంట్లు నిమ్మకాయను తినొచ్చా? లేదా?

Published : Jun 05, 2022, 12:54 PM IST

Lemon Benefits For Diabetes: డయాబెటీస్ పేషెంట్లు.. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు కొన్ని రకాల ఆహారాలకు ఎంత దూరంగా  ఉంటే అంత మంచిది.   

PREV
17
Diabetes: షుగర్ పేషెంట్లు నిమ్మకాయను తినొచ్చా? లేదా?

Lemon Benefits For Diabetes: మధుమేహం ఒకసారి వచ్చిందంటే అంది అంత సులువుగా పోదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది మీరు బతికున్నంత వరకు మీతోనే ఉంటుందన్న మాట. అందులోనూ కొన్ని రకాల ఆహారాలు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడానికి సహాయపడతాయి. అలాంటి వాటికి వీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏదైనా తాగడానికి లేదా తినడానికి ముందు ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతదా? లేదా? అన్న విషయాలను తెలుసుకోవాలి. 

27

కాగా నిమ్మకాయ మధుమేహులకు ఎంతో మంచి చేస్తుంది. దీనిలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఇంతకి నిమ్మకాయ మధుమేహులకు ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం పదండి.. 
 

37

నిమ్మకాయ (Lemon)లో 2.4 గ్రాముల ఫైబర్  (Fiber) కంటెంట్ ఉంటుంది. ఇది మధుమేహులు గుండె జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది. నిమ్మలో పుష్కలంగా ఉండే ఫైబర్ గ్లైసెమిక్ (Glycemic) నియంత్రణను మెరుగుపరుస్తుంది. 

47

అలాగే ఇన్సులిన్ పై ఆధారపడటాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది ట్రైగ్లిజరైడ్ (Triglyceride) స్థాయిలను కూడా తగ్గిస్తుంది. బరువును వేగంగా తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయ మధుమేహులకు మంచే తప్ప చెడు అసలే చేయదు. 

57

నిమ్మకాయ రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.. నిమ్మలో గ్లైసెమిక్ ఇండెక్స్  (Glycemic index)తక్కువగా ఉంటుంది. ఈ పండులో ఉండే విటమిన్ సి చక్కెరను శోషించుకోవడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే సిట్రస్ ఫ్లేవనాయిడ్లు జీర్ణక్రియకు సహాయపతాయి. 

67

ఇది పేగులలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. దీంతో మీ రక్తంలోకి చక్కెర నేరుగా ప్రవేశించదు. తద్వార రక్తంలో రక్తంలో చక్కెర లెవెల్స్ పెరగవు. నిమ్మకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం కావట్టి ఇది షుగర్ పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు దీనిని హాయిగా తినొచ్చు. 
 

77

గుండెను ఆరోగ్యంగా ఉంచే పొటాషియం నిమ్మకాయలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటు (Blood pressure)ను తగ్గిస్తుంది. అలాగే స్ట్రోక్ (Stroke), గుండెపోటు (heart attack) ప్రమాదాలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే మధుమేహులకు ఈ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో నిమ్మకాయను తినడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో కాల్షియాన్ని ఏర్పరచడం వల్ల ధమనుల అడ్డంకిని తగ్గిస్తుంది కూడా.  

click me!

Recommended Stories