Cholesterol Symptoms: ప్రస్తుత కాలంలో.. చాలా మంది వ్యక్తుల జీవనశైలి కారణంగా వారిలో కొలెస్ట్రాల్ (Cholesterol) పెరగడం సర్వ సాధారణమైంది. సాంకేతికత అభివృద్ధి కారణంగా మనం మునుపటి కంటే మరింత సోమరులుగా మారిపోతున్నాం. శారీరక శ్రమ లేకపోవడం, ఆయిల్ ఫుడ్ (Oil food)ను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది. ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. అది అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఒత్తిడి, మధుమేహం, హార్ట్ ఎటాక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ వంటి వ్యాధులకు కూడా దారితీస్తుంది.