కొన్ని రకాల ఆహారాలు మొటిమలకు చికిత్స చేయకపోవచ్చు. కానీ మొటిమలను తగ్గించడానికి మాత్రం సహాయపడతాయి. కానీ కొన్ని రకాల ఆహారాలు మాత్రం మొటిమలను మరింత పెంచుతాయి. మొటిమలను పెంచే పదార్థాలలో పాల ఉత్పత్తులు (Dairy products), మాంసం (Meat), నూనెలో వేయించిన పదార్థాలు, జున్ను (Cheese), చాలా రోజులు నిల్వ చేసిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ మొదలైనవి ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ క్రింది పదార్ధాలను తినకపోవడం ద్వారా మొటిమలను (Pimples) చాలా వరకు తగ్గించుకోవచ్చు.
sugar
నో షుగర్ (No sugar): మీ ఆహారంలో ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరతో త్వరగా కలిసిపోయి ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. మొటిమలు త్వరగా వచ్చే అవకాశం గల వారికి అధిక ఇన్సులిన్ స్థాయిలు చర్మానికి తగినవి కావు.
అధిక గ్లైసెమిక్ ఉన్న ఆహారాలు (High glycemic foods): కొన్ని ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల ఇన్సులిన్ విడుదల అవుతుంది. ఇటువంటి కొన్ని ఆహారాలను అధిక గ్లైసెమిక్ కార్బోహైడ్రేట్లుగా వర్గీకరిస్తారు. రక్తంలో అధిక ఇన్సులిన్ స్థాయిలు మీ చర్మం యొక్క నూనె గ్రంథులను ప్రేరేపించి మరింత నూనెను పుట్టిస్తాయి. తద్వారా మొటిమల ప్రమాదం మరింత పెరుగుతుంది.
జంక్ ఫుడ్ (Junk food): ఫ్యాటీ ఫుడ్ జంక్ ఫుడ్ ఇతర ఆహార పదార్థాల కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఆయిల్, ప్రాసెస్ చేయబడ్డ కార్బోహైడ్రేట్ లు మరియు క్యాలరీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీకు మొటిమలు వచ్చే అవకాశం ఉన్న చర్మం ఉంటే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి.
సోయా ఉత్పత్తులు (Soy products): సోయా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ దీనిలో ఫైటోస్ట్రోజన్లు (Phytoestrogens) అధికంగా ఉంటాయి. ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇది చర్మాన్ని జిడ్డుగా మారుస్తుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది.
పాల ఉత్పత్తులు (Dairy products): పాలు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఇది మొటిమలను మరింత ఎక్కువ చేస్తుంది.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమలకు ఉత్తమమైన ఆహారాలు.. ఆకుకూరలు, క్యారెట్లు (Carrots), ఆప్రికాట్లు (Apricots), టమోటాలు(Tomatoes), బెర్రీలు, జీడిపప్పులు, చేపలు, సీ ఫుడ్స్, పసుపు మరియు ఎరుపు పండ్లు, ప్రాసెస్ చేయని పండ్లు మరియు కూరగాయలు, చిక్కుళ్ళు మొదలైనవి.
అవోకాడో (Avocado): అవకాడో లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అవి మొటిమలను వదిలించుకోవడానికి ఎంతో సహాయపడతాయి.
బీట్ రూట్ (Beat root): బీట్ రూట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. మీ ముఖంపై ఉండే మొటిమలు తగ్గాలంటే కీరదోసకాయ లేదా క్యారెట్ జ్యూస్ తో కలిపిన బీట్ రూట్ జ్యూస్ తాగండి.
బెర్రీలు (Berries): బ్లాక్ బెర్రీస్ వంటి డార్క్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.
బ్రోకలీ (Broccoli): బ్రోకలీలో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, సి, ఇ, మరియు కె , ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలతో పోరాడే సామర్థ్యంతో సహా మన చర్మానికి వివిధ మార్గాల్లో సహాయపడతాయి.