Neck Pain: వర్క్ ఫ్రం చేసేవాళ్లు ఈ తప్పులు చేయకండి..లేదంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది

Published : Aug 22, 2026, 07:32 PM IST

Neck Pain: ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం వల్ల గంటల తరబడి ల్యాప్ టాప్ ముందేసుకుని కూర్చుంటారు. ఎక్కువ సేపు కిందకు చూడటం వల్ల మెడ, భుజాలు, వీపుపైన ప్రెజర్ పెరిగి విపరీతమైన నొప్పిగా ఉంటుంది. ఈ చిన్న మార్పుల వల్ల వాటిని దూరం చేసుకోవచ్చు.

PREV
16
రోజంతా ల్యాప్ టాప్ వాడేవారు ఇవి తెలుసుకోవాలి

ఈ రోజుల్లో ఆఫీస్ పనులే కాదు, చాలామంది ఇంటి నుంచి కూడా ల్యాప్‌టాప్‌లపై గంటల తరబడి పనిచేస్తున్నారు. ఇలా ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చొని, ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కిందకు చూస్తూ ఉండటం మెడ, వెన్ను భాగాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. కేవలం ల్యాప్‌టాప్ వాడటం వల్లే వెన్నెముక దెబ్బతింటుందని కాదు… స్క్రీన్ ఎత్తు, కూర్చునే విధానం, ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండటం, విరామం లేకుండా పనిచేయడం వంటివే ప్రధాన కారణాలు.

26
కిందికి చూస్తూ ఉండటం వల్ల మెడపై ఒత్తిడి
ల్యాప్‌టాప్ స్క్రీన్, కీబోర్డ్ ఒకే పరికరంలో ఉండటంతో, చాలామంది దాన్ని టేబుల్‌పై కిందకు పెట్టి పనిచేస్తుంటారు. దీనివల్ల స్క్రీన్‌ను చూడటానికి తల, మెడను ముందుకు, కిందకు వంచాల్సి వస్తుంది. ఈ భంగిమలో ఎక్కువసేపు ఉండటం వల్ల మెడకు సపోర్ట్ ఇచ్చే కండరాలపై ఎక్కువ భారం పడుతుంది. ఇలా ఒకే పొజిషన్‌లో ఉండటం వల్ల మెడ, భుజాల కండరాల్లో అలసట, బిగుతు ఏర్పడే అవకాశం ఉంది.
36
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

ల్యాప్‌టాప్‌లో ఎక్కువసేపు పనిచేసే వారికి మొదట్లో పెద్ద సమస్యగా కాకుండా కొన్ని చిన్న లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. మెడ పట్టేయడం, భుజాల నొప్పి, వీపు పైభాగంలో అసౌకర్యం, తలనొప్పి, పని పూర్తయ్యాక అలసటగా అనిపించడం వంటివి ఇందులో ఉంటాయి. ఈ లక్షణాలను పట్టించుకోరు కొందరు. అలా అయితే రోజువారీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి.

46
టెక్ నెక్ అంటే ఏమిటీ?
స్క్రీన్ ఉన్న డివైజ్‌లను ఎక్కువసేపు వాడేటప్పుడు తల ముందుకు వంగి ఉండే భంగిమను సాధారణంగా ‘టెక్ నెక్’ లేదా ‘టెక్స్ట్ నెక్’ అని పిలుస్తారు. అయితే, దీన్ని ఒక ప్రత్యేకమైన వైద్యపరమైన వ్యాధిగా పరిగణించడంపై వైద్య పరిశోధనల్లో ఏకాభిప్రాయం లేదు. కానీ, ఎక్కువసేపు తప్పుడు లేదా అసౌకర్యమైన భంగిమలో ఉండటం మెడ, భుజాల కండరాలపై ఒత్తిడిని పెంచుతుందని గమనించాలి.
56
ల్యాప్ టాప్ ఎలా ఉపయోగించాలి?

ల్యాప్‌టాప్‌లో ఎక్కువసేపు పనిచేసే వారు కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా మెడ, వెన్నుపై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను కళ్ల ఎత్తుకు దగ్గరగా ఉండేలా పైకి లేపండి.

ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తే, వేరే కీబోర్డ్, మౌస్ వాడండి.

వెన్నెముకకు తగిన సపోర్ట్ ఉండేలా కూర్చోండి.

స్క్రీన్‌ను మీకు సూటిగా ఎదురుగా ఉంచండి.

ఒకే భంగిమలో కాకుండా అప్పుడప్పుడు పొజిషన్ మార్చండి.

ఎక్కువసేపు పనిచేసేటప్పుడు మధ్యలో చిన్న విరామాలు తీసుకుని శరీరాన్ని కదిలించండి.

స్క్రీన్‌ను చూడటానికి ముందుకు వంగడం తగ్గించండి.

66
నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ ను కలవండి

ఎక్కువసేపు పనిచేసిన తర్వాత మెడ కొద్దిగా పట్టేయడం సాధారణమే. కానీ, నొప్పి తగ్గకుండా పెరుగుతున్నా, చేతుల్లో తిమ్మిర్లు, చేతులు బలహీనపడటం, బ్యాలెన్స్ తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తే, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ను పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని వాడే పద్ధతిని మార్చుకోవడం ముఖ్యం. స్క్రీన్‌ను సరైన ఎత్తులో ఉంచడం, వెన్నెముకకు సపోర్ట్ ఇవ్వడం, బయటి కీబోర్డ్, మౌస్ వాడటం, మధ్యమధ్యలో లేచి నడవడం వంటి చిన్న అలవాట్లు ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు శారీరక శ్రమను తగ్గించడంలో సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories