జన్మాష్టమి పూజా విధానం.. ఆరతి, వ్రతం, దహీ హండీ సమయాలు..

First Published Aug 28, 2021, 5:22 PM IST

రోహిణి నక్షత్రం ఆగస్టు 30న తెల్లవారుజామున 06:39 గంటలకు ప్రారంభమై ఆగస్టు 31న ఉదయం 09:44 గంటలకు ముగుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా దేశ,విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు జన్మాష్టమిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 30 న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. శ్రీకృష్ణుడి పుట్టినరోజుగా ఈ రోజు ప్రసిద్ధి. జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. అయితే కరోనామహమ్మారి ఈ వేడుకల మీదా ప్రభావం చూపించింది. 

సామూహికంగా జరుపుకునే ఉత్సవం కాబట్టి దీనికి నిబంధనలు విధించారు. కఠినమైన కోవిడ్ ప్రోటోకాల్ అమలులో ఉండటం వల్ల సామూహిక ఉత్సవాలు బ్యాన్ విధించారు. అయితే అన్ని ఆలయాలలో పూజలు విధివిధానం ప్రకారం జరుగుతాయి. 

శ్రీ కృష్ణ జన్మాష్టమి పూజ సమయం :
శ్రీ కృష్ణ జయంతి యోగం. ఇది  శ్రీకృష్ణుని 5248 వ జయంతి. 
ఈ యేడాది 2021, ఆగస్టు 30, సోమవారంనాడు కృష్ణ జన్మాష్టమి
నిషిత పూజ సమయం - రాత్రి 11:59  నుండి ఆగస్టు 31 తెల్లవారుజాము 12:44, వరకు
అంటే..వ్యవధి - 00 గంటలు 45 నిమిషాలు
ఆగస్టు 31, 2021, మంగళవారం నాడు ఉట్ల పండుగ

ధర్మ శాస్త్రం ప్రకారం పరనా
-పరణ సమయం - ఆగస్టు 31 ఉదయం 9 గంటల 44నిమిషాల తర్వాత...
-పరణ రోజు సూర్యోదయానికి ముందే అష్టమి ముగుస్తుంది
-ధర్మ శాస్త్రం ప్రకారం ప్రత్యామ్నాయ పరాణ
-పరణ సమయం - ఆగస్టు 31నాడు ఉదయం 05:59  తర్వాత
-జన్మాష్టమి తరువాతి రోజు సూర్యోదయం తర్వాతదేవ పూజ, విసర్జనం పరణ చేయవచ్చు.
-పరణ సమయం - ఆగస్టు 31 ఉదయం  12:44 తర్వాత
భారతదేశంలోని అనేక ప్రదేశాలలో, పరణ నిషిత అర్ధరాత్రి తర్వాత జరుగుతుంది

అర్ధరాత్రి ముహూర్తం - ఆగస్టు 31, ఉదయం 12:22
చంద్రోదయ క్షణం - 11:35 రాత్రి కృష్ణ దశమి
అష్టమి తిథి ప్రారంభం - ఆగష్టు 29, 2021 న రాత్రి 11:25 
అష్టమి తిథి ముగింపు - ఆగష్టు 31, 2021  ఉదయం 01:59 లకు..
రోహిణి నక్షత్రం ప్రారంభం - 30, 2021 న ఉదయం 06:39 లకు..
రోహిణి నక్షత్రం ముగింపు - ఆగష్టు 31, 2021 న ఉదయం 09:44 లకు..

జన్మాష్టమి పూజ విధానం : స్వచ్ఛమైన భక్తితో, నిర్మలమైన మనసులో పూజిస్తే భగవంతుడు తప్పకుండా వింటాడు. అందుకే మీరు మరీ పద్ధతులు తెలియకపోయినా భగవంతుడు క్షమించేస్తాడు. ముందుగా ఒక ఊయలను రెడీ చేసుకోండి. అందులో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టండి. 

భగవంతుడిని ధ్యానిస్తూ ఆ విగ్రహం పాదాలు గంగాజలంతో కడగండి. తరువాత అభిషేకం చేయండి. అభిషేకానికి పాలు, నీళ్లు కూడా ఉపయోగించవచ్చు. తరువాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి కొత్త బట్టలు అలంకరించండి. అలంకరణ పూర్తైన తరువాత మురళిని అలంకరించండి. జంజెం కూడా వేయవచ్చు. 

ఆ తరువాత దేవుడికి చందనం, గంధాన్ని పూయండి. మార్కెట్‌లో జన్మాష్టమి సందర్భంగా కృష్ణ వస్త్రాలతో పాటు లభించే కొత్త నగలను కూడా అలంకరించండి. పూలు అలంకరించి, దూపదీపాలు వెలిగించండి. ఆ తరువాత భక్తితో ప్రార్థన చేయండి. 

ఇంట్లో తయారు చేసిన నైవేద్యాన్ని కానీ, బైటినుంచి తెప్పించిన స్వీట్లు కానీ స్వామివారికి సమర్పించండి.  పాన్, సుపారీ, పండ్లు,డబ్బులతో కూడిన తాంబూలం అర్పించి.. దూపదీప నైవేద్యాలు సమర్పించండి. 

శ్రీ కృష్ణుని ఆరతి

అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రసాదంతో మీ ఉపవాసాన్ని విరమించండి. జన్మాష్టమినాడు ఉపవాసం పాటించే భక్తులు ఉపవాసం లేదా వ్రతాన్ని విరమించే ముందు ప్రార్ణ సమయాన్ని మనస్సులో ఉంచుకోవాలి.

జన్మాష్టమి వ్రత ఆచారం :
సాధారణంగా, జన్మాష్టమి నాడు, భక్తులు ఒక రోజంతా ఉపవాసం పాటిస్తారు. జన్మాష్టమి మొదలయ్యే రోజు అర్థరాత్రి 12 గంటలప్పుడు పండ్లు, ప్రసాదంతో భగవంతుడికి మొదట సమర్పిస్తారు. తరువాత స్నేహితులు, బంధువులు, చుట్టు పక్కల వారికి స్వీట్లు పంపిణీ చేస్తారు.రోజంతా కృష్ణ భజనలు, భక్తి గీతాలు, నృత్యాలతో దేవుడిని ప్రార్థిస్తారు.

click me!