ఎదిగే పిల్లలకు హగ్ ఎంతో అవసరమంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే వారిని తరచుగా హగ్ చేసుకుంటే వాళ్లు శరీరకంగా ఎదగడంతో పాటుగా మానసికంగా కూడా ఎదుగుతారని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హగ్ తో పిల్లల్లో పాజిటీవ్ నెస్ పెరుగుతుందని అధ్యయనాలు తేల్చి చెబుతున్నారు. కాగా కొంత మంది మానసిక శాస్త్రవేత్తలు ఈ విషయంపై క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అందులో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దీని కోసం కౌగిలింతలకు దూరమైన కొంత మంది అనాథపిల్లలను సెలక్ట్ చేసుకున్నారు. ఆ చిన్నారులు శరీరకంగానే కాదు, మానసికంగా కూడా క్రుంగుబాటుకు గురయ్యాని వారు తెలిపారు. అయితే ఈ పిల్లలపై హగ్ ఎంతో ప్రభావం చూపిందని పేర్కొన్నారు. కౌగిలింతతో వారిలో శారీరక, మానసిక అభివృద్ధి ఎంతో జరిగిందని పేర్కొంటున్నారు. అంతేకాదు పదివారాల పిల్లలపై హగ్ చాలా ఎఫెక్ట్ చూపుతుందని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు.