cancer: ఈ 5 అలవాట్లు ఆరోగ్యకరమైన వ్యక్తులను కూడా క్యాన్సర్ బారిన పడేస్తాయి..

First Published May 14, 2022, 1:25 PM IST

cancer: క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. ఇది నయం కాని రోగం. దీని బారిన పడిన వ్యక్తి రోజు రోజుకు కుంచించుకోపోతారు. అయితే కొన్ని కారకాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 
 

కొన్నేండ్ల నుంచి భారతదేశంలో క్యాన్సర్ కారణంగా మరణాల సంఖ్య పెరిగిపోతోందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఉన్నట్టుండి మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఎలా ఉత్తేజితమవుతాయి.. ? శరీరంలో అకస్మత్తుగా క్యాన్సర్ ఎందుకు బయటకు వస్తుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 

క్యాన్సర్ కారణాలు.. క్యాన్సర్ అంతర్గత , బాహ్య కారకాల వల్ల వస్తుంది. అంతర్గత కారకాలలో.. జన్యు ఉత్పరివర్తనాలు, హార్మోన్లు, రోగ నిరోధక సంబంధిత పరిస్థితులు, ధూమపానం, మధ్యపానం, వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయి. ఈ కారకాలన్నీ సాధారణంగా కణం ఒంటరిగా లేదా ఒకదానితో మరొకటి కలిసి తీవ్రంగా మారుతాయి. 

cancer

క్యాన్సర్ ప్రమాదాన్ని ఏ కారకాలు పెంచుతాయో వైద్యులకు బాగా తెలుసు. కానీ చాలా క్యాన్సర్లు ఎటువంటి ప్రమాద కారకాలు లేని వ్యక్తులలో కూడా కనిపిస్తాయి. 

క్యాన్సర్ బయటపడటానికి ఏండ్లు పట్టొచ్చు. అందుకే చాలా మంది క్యాన్సర్ కేవలం 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వారికే వస్తుందని భావిస్తుంటారు. ఇలా జరగడం ఓల్డేజ్ లో సర్వ సాధారణం. కానీ క్యాన్సర్ పెద్దలకు సాధారణంగా సోకే వ్యాధి కాదు. ఇది ఏ వయసువారికైనా సోకొచ్చు. 

కొన్ని చెడు అలవాట్లు కూడా క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచుతాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువ సూర్యరశ్మి, ఊబకాయం, అసురక్షితమైన శోషరస చర్యకు గురికావడం ఇవన్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 

క్యాన్సర్ వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్టైతే.. తరువాతి తరానికి కూడా ఇది సోకే అవకాశం ఉంది. జన్యు ఉత్పరివర్తనం కలిగి ఉండటం వల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందనుకోవడం పొరబాటే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

వ్రణోత్పత్తి పెద్దప్రేగు శోథ వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా మీ క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి. మీరు ఈ వ్యాధులతో పోరాడుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి.  ఏవైనా లక్షణాలను గమనించినట్లైతే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

click me!