
బాదం పప్పులు మన మెదడు (Brain) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదం పప్పులను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ బాదం పప్పుల తొక్కలను తీసేసి తింటేనే మన ఆరోగ్యానికి మంచిది. అందుకే చాలా మంది ఈ తొక్కలను తీసి పారేస్తుంటారు. మీకు తెలుసా.. మీరు పారేసే బాదం తొక్కలు కూడా మనకు ఎన్నో విధాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ బాదం తొక్కలు మన రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు. వీటిని చట్నీ నుంచి ఫేస్ వాష్ వరకు ఉపయోగించవచ్చు. ఈ బాదం తొక్కలను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం పదండి..
బాదం తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు.. వాస్తవానికి బాదం తొక్కలల్లో టానిన్లు (Tannins) ఉంటాయి. ఇవి పోషకాలు గ్రహించబడకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
బాదం తొక్కలను అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. దీనిని ఎండబెట్టి పొడి చేసి.. పెరుగు, పాలు, ఐస్ క్రీమ్ ల్లలో వేస్తే అవి చిక్కబడటానికి సహాయపడుతుంది. దీని కోసం కేవలం 8-10 రోజుల బాదం తొక్కలను సేకరించి మంచిగా ఎండబెట్టి గ్రైండ్ చేసి.. ఆ పౌడర్ ను గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేయండి. ఇక అవసరమున్నప్పుడు పాలు, పెరుగు, ఐస్ క్రీమ్ వంటివి చిక్కగా మారడానికి అర టీస్పూన్ నుంచి ఒక టీస్పూన్ వరకు ఈ పౌడర్ ను వేయండి.
బాదం తొక్కలు కూడా ఎరువుగా పనిచేస్తాయి. ఇవి మొక్కలలో ఫ్లేవనాయిడ్లు మరియు ద్వితీయ జీవక్రియలను ప్రోత్సహించడానికి సహాయపడుతాయి. అంతే కాదు బాదం తొక్కలను మొక్కలకు ఎరువుగా వేయడం వల్ల పువ్వుల రంగు కూడా పెరుగుతుంది. బాదం తొక్కలు మొక్కలకు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయాల్స్, యాంటీవైరల్స్, ఫోటోప్రొటెక్టివ్స్ మరియు ప్రీ బయోటెక్ గా కూడా ఉపయోగపడతాయి. దీనికోసం బాదం తొక్కలను ఎండలో ఆరబెట్టాలి. తర్వాత దాన్ని చూర్ణం చేసి చెట్ల మొక్కల్లో వేయాలి.
మీరు ఎప్పుడైనా బాదం తొక్క చట్నీ తిన్నారా? లేకపోతే ఈ రోజే ప్రయత్నించండి. ఎందుకంటే ఇది రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి బాదం తొక్క కరగని ఫైబర్ తో తయారు చేయబడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. దీని కోసం అరకప్పు బాదం తొక్కను రాత్రంతా లేదా నీటిలో 3 నుంచి 4 గంటలు నానబెట్టండి. ఈ లోగా శనగలు వేయించాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, నల్ల మిరియాలు వేసి వేయించి అందులో చింతపండు గుజ్జు వేయాలి. తరువాత బాదం తొక్క, శనగపప్పు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి చట్నీని తయారుచేసుకోవచ్చు. దీనిని దేనితోనైనా తినొచ్చు.
మీరు బాదం తొక్కలను బాడీ క్లీన్సర్ (Body cleanser) గా కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మంపై ఉండే మురికిని మొత్తం తొలగిస్తుంది. అలాలే మృదువుగా కూడా చేస్తుంది. చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తుంది. అంతేకాదు ఇది యాంటీ ఏజింగ్ నుంచి కూడా రక్షిస్తుంది. దీనికోసం బాదం తొక్కలను పాలు, పెరుగు, రోజ్ వాటర్, తేనెతో మిక్స్ చేసి వారానికి 2 రోజులు ఉపయోగించాలి.
ఇది కాకుండా.. మీరు బాదం తొక్కల పొడిని తయారు చేసి ఎక్స్ఫోలియేటర్ (Exfoliator) గా కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం బాదం తొక్కలను ఎండబెట్టి దాని పొడిని తయారు చేసి, ఆ తర్వాత దానికి కొద్దిగా రోజ్ వాటర్ లేదా కలబంద జెల్ మిక్స్ చేయాలి. దానితో మీ శరీరం లేదా ముఖాన్ని స్క్రబ్ చేయాలి. దీనివల్ల మృతకణాలు సులభంగా పోయి చర్మం మృదువుగా మారుతుంది.