Health tips: వేరుశెనగలు, బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిలో కొవ్వు, నూనెలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మనకు అస్సలు మంచివి కావు.
Health tips: సూపర్ ఫుడ్స్ గా పిలువబడే వేరుశెనగలు (Peanuts), ముడి బాదం పప్పులు(Raw almond) మన ఆరోగ్యానికి హానికరం. అవును.. పోహా నుంచి చట్నీ, చాట్ వరకు మనం ఉపయోగించే వేరుశెనగలు మన ఆరోగ్యానికి ముప్పుగా మారతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటిలో కొవ్వు , నూనె అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మనకు అస్సలు మంచిది కాదు. వేరు శెనగలను తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి.
27
బరువు పెరగడం.. వేరుశెనగలో కేలరీలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దారితీస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వేరుశెనగలను తినకపోవడమే మంచిదని నిపుణులు సలహానిస్తున్నారు.
37
అలర్జీలు.. వేరే శెనగలను అధికంగా తినడం వల్ల ముక్కు కారడం, దద్దుర్లు, దురద, వాపు లేదా ఎర్రబడటం, జలదరింపు, గొంతునొప్పి, జీర్ణ సమస్యలు వంటి అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
47
సోడియం పరిమాణాన్ని పెంచుతుంది.. చాలా మంది ఉప్పు కలిపిన వేరుశెనగలను తినడానికి ఇష్టపడతారు. కానీ ఈ సాల్టెడ్ వేరుశెనగలు శరీరంలో సోడియం మొత్తాన్ని పెంచుతాయి. రక్తపోటు, గుండె జబ్బులు ఉండేవాళ్లు వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఉప్పు కలిపిన వేరుశెనగలను ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల రక్తపోటు విపరీతంగా పెరగడమే కాదు.. గుండె కూడా రిస్క్ లో పడుతుంది.
57
కాలేయాన్ని దెబ్బతీస్తుంది.. ఎక్కువ మొత్తంలో వేరుశెనగ తినడం ద్వారా అఫ్లాటాక్సిన్ల పరిమాణం పెరుగుతుంది. ఇది హానికరమైన పదార్థం. ఇది మన కాలేయానికి చాలా నష్టాన్ని కలిగిస్తుంది.
67
ఒమేగా ఫ్యాటీ యాసిడ్ అసమతుల్యత.. ఒమేగా 6 అనేది ఒక ముఖ్యమైన Polyunsaturated ఫ్యాటీ యాసిడ్. ఇది మీకు శక్తిని ఇస్తుంది. ఒమేగా 6 మరియు 3 ఫ్యాటీ ఆమ్లాలను సమానంగా తీసుకోవడం వల్ల శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే వేరుశెనగలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లోపం ఉంటుంది. అంతేకాదు దాని వినియోగం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.
77
కొవ్వు అధికంగా.. వేరుశెనగలను ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది స్ట్రోక్, గుండెపోటు, జీర్ణ సమస్యలు, అధిక రక్తపోటు, ధమనులు మూసివేయడం మొదలైన వాటికి దారితీస్తుంది.