Health Care Tips: ఇవి తిన్న తర్వాత టీ ని మాత్రం తాగకండి.. ఒక వేళ తాగారో పని అంతే ఇక..

Published : May 26, 2022, 04:55 PM IST

Health Care Tips: టీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా మారడంతో పాటుగా రీఫ్రెష్ గా కూడా అనిపిస్తుంది. అయితే కొన్నిరకాల ఆహారాలను తిన్న తర్వాత టీని తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

PREV
18
Health Care Tips: ఇవి తిన్న తర్వాత టీ ని మాత్రం తాగకండి.. ఒక వేళ తాగారో పని అంతే ఇక..

టీ కున్న క్రేజ్ కాఫీకి కూడా లేదేమో. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ టీని తాగడానికే ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అందుకే రకరకాల పేర్లతో నగరాల్లో.. పట్టణాల్లో టీ షాపులు పుట్టుకొస్తున్నాయి. 
 

28

తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటుగా.. ఒత్తిడిని తగ్గించడానికి కూడా టీ ఎంతో సహాయపడుతుంది. అందుకే ఆఫీసుల్లో పనిచేసేవారు ప్రతి రెండు మూడు గంటలకోసారి టీ తాగుతుంటారు. 
 

38

ఇక టీలలో అల్లం టీ, బాధం టీ ,  సొంటి టీ, హెర్బల్ టీ వంటివి లభిస్తాయి. రిలాక్స్ కోసం తాగే టీ లను ఎంత మోతాదులో తాగితే అంత మంచిది. మోతాదుకు మించితే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టీని కొన్ని రకాల ఆహారాలను తిన్న తర్వాత అస్సలు తాగకూడదు. అవేంటంటే.. 

48

చల్లని ఐస్ క్రీం లేదా పానీయాలను, లేదా చల్లని నీళ్లను తాగిన వెంటనే టీని ఎట్టి పరిస్థితిలో తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలా తాగితే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. 

58

నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ నిమ్మరసం తాగిన వెంటనే టీ ని అస్సలు తాగకూడదు. ఒకవేళ తాగితే ఎసిడిటీ సమస్య వస్తుంది. 

68

శెనగపిండితో చేసిన ఆహారాలు, దోశలు, అట్లు వంటివి తిని టీని అస్సలు ముట్టుకోకూడదు. ఒకవేళ తాగితే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడి ఎన్నో సమస్యలు వస్తాయి. 

78

టీని భోజనం చేసిన వెంటనే అస్సలు తాగకూడదు. ఒకవేళ ఇలా తాగే అలవాటుంటే వెంటనే మానుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత టీని తాగితే రక్తపోటు సమస్యలు వస్తాయి. దీంతో గుండె రిస్క్ లో పడుతుంది. 

88

షుగర్ పేషెంట్లు టీని తాగకపోవడమే వీరి ఆరోగ్యానికి మంచిదంటే. ఎందుకంటే టీలో ఉండే చక్కెర వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. అందుకే వీరు టీని అస్సలు తాగకూడదు. ఒకవేళ తాగితే షుగర్ ఫ్రీ టీని తాగడం మంచిది. 

Read more Photos on
click me!

Recommended Stories